కల నెరవేరిందంటూ ఎమోషనల్ ట్వీట్ చేస్తూ కమల్ హాసన్ కి థాంక్స్ చెప్పిన సూర్య!

కమలహాసన్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించిన చిత్రం విక్రమ్. ఈ సినిమా జూన్ 3వ తేదీ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు.ఇక ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో విడుదల అయ్యి విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ ముగ్గురే కాకుండా ఈ సినిమాలో సూర్య అతిథి పాత్రలో సందడి చేశారు.ఇక ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా పై హీరో సూర్య స్పందిస్తూ కమల్ హాసన్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సూర్య స్పందిస్తూ ప్రియమైన కమల్ హాసన్ అన్న మీకు ఎలా థాంక్స్ చెప్పాలో తెలియలేదు. మీతో కలిసి నటించడం అనేది నా కల. ఆ కల విక్రమ్ సినిమాతో నెరవేరింది. ఇందుకు కారణమైన దర్శకుడు లోకేష్ కనకరాజ్ కు కృతజ్ఞతలు తనపై ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమకు ఎంతో గర్వంగా ఉంది అంటూ ఈ సందర్భంగా కమల్ హాసన్ కి సూర్య ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ పై స్పందించిన కమల్ హాసన్ రీ ట్వీట్ చేశారు.

 

కమల్ హాసన్ సరదాగా సూర్యను తంబి అంటూ సంబోధిస్తారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ స్పందిస్తూ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇప్పటికీ ఎంతో ప్రేమ కలిగి ఉన్నారని ఇప్పుడు ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ మరికాస్త పెరిగిందని సూర్య భవిష్యత్తుకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సరదాగా తంబీ అన్నారు. ఈ ట్వీట్ పై సూర్య స్పందిస్తూ నవ్వుతున్న ఏమోజీను షేర్ చేస్తూ పెద్దన్నయ్యా అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.