MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న సినీతారలు.?

MS Dhoni: తాజాగా మహేంద్రసింగ్ ధోని యాక్షన్ సీన్ లలో స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా ఇరగదీశాడు. తాజాగా అన్ అకాడమికి సంబంధించిన వ్యాపార ప్రకటనలో మహేంద్ర సింగ్ ధోనీ నటించి ప్రపంచవ్యాప్తంగా తన అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ధోని నటించిన లెస్సన్ 7 వ్యాపార ప్రకటన పై క్రికెటర్లు, సినీ తారలు ధోనీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా అన్ అకాడమీ అనే సంస్థ కోసం ధోని ఒక వ్యాపార ప్రకటనలో నటించాడు. ఈ వ్యాపార ప్రకటనల వెనుక రైలు వస్తుంటే దాని ముందు వేగంగా పరిగెత్తుకుంటూ వెళుతూ తనకు ఎదురైనా అడ్డంకులను సునాయాసంగా తొలగించుకుంటూ గమ్యాన్ని చేరుకుంటాడు.

ఇక ఈ వీడియోలో యాక్షన్ సీన్ సన్నివేశాలలో ధోని నటించిన తీరుపై పలువురు సినీ తారలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విషయంపై క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ.. వావ్ ఎంఎస్ ధోని కొట్టే హెలికాప్టర్ షాట్ కంటే గొప్పగా ఉంది.. ఇది కేవలం ధోని స్టోరీనే కాదు ప్రతి క్రికెటర్ కథ.. జీవితంలో ఎదురైన ఎన్నో కష్టాలను ఎలా అధిగమించాలి అన్న విషయాన్ని స్ఫూర్తిదాయకంగా చూపించాడు. ఇది మంచి మనోవికాస పాఠంగా అనిపించింది అని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. అనంతరం టాలీవుడ్ బ్యూటీ సమంత ఈ విషయంపై స్పందిస్తూ..లెస్సన్ నంబర్ 7 జీవితానికి ఒక పాఠం.

 

జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను ఎలా ఎదుర్కొనాలి అనే విషయాన్ని అద్భుతంగా చిత్రంలో చూపించారు. ఈ వీడియోని నేను పదేపదే చూస్తూ ఉండిపోయాను. ఎంతోమందికి ప్రేరణగా నిలిచేందుకు అన్ అకాడమీ రూపొందించిన వీడియో సహాయపడుతుంది అంటూ సమంత ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన ధోని అభిమానులు ఆ వీడియో ని తెగ వైరల్ చేస్తున్నారు.