భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది హక్కు అయినప్పటికీ ఇతరుల మీద వ్యక్తిగతంగా దూషణలు చేయటం ఎంతమాత్రం సమంజసం కాదు. మా ఇష్టం… మేము ఇష్టమొచ్చినట్లు మాట్లాడతాం అంటే అందరు చూస్తూ ఊరుకోరు. పాపులర్ అయిపోతాం,ఫేమ్ వచ్చేస్తుందనే వ్యామోహంతో కొందరు మితిమీరి యూట్యూబ్, సోషల్ మీడియాలో ప్రముఖల మీద విమర్శలు, ఆరోపణలు, బూతులు తిట్టటం ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైంది.
తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇలాంటి అనుభవమే ఎదుర్కొన్నారు. ‘పొలిటికల్ మోజో’ అనే పేరు గల యూట్యూబ్ ఛానెల్ మోహన్ బాబుపై బూతులు తిడుతూ వీడియోల రూపంలో పోస్ట్ చేస్తున్నారంటూ ఆయన లీగల్ అడ్వైజర్ సంజయ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూట్యూబ్‌లో మోహన్‌బాబును కొందరు టార్గెట్ చేసి మరీ ట్రోలింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు, దర్యాప్తును ప్రారంభించారు.
https://www.youtube.com/watch?v=R1f9hydCwSA&t=307s