‘ఆండ్రాయిడ్‌` గా మారుతున్న మోహన్‌బాబు

గత నాలుగున్నర దశాబ్దాల సినీ జీవితంలో కలెక్షన్ కింగ్‌గా, విలక్షణ నటుడిగా రాణించారు మోహన్‌బాబు. హీరోగా, విలన్‌గా, కీ రోల్స్ చేసి మెప్పించాడు. ‘కలెక్షన్ కింగ్’ గా పిలవబడే మోహన్ బాబు ఒక టైం లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లకు పోటీగా వచ్చి సక్సెస్ అయ్యాడు. హీరో గా కొంత విరామం తీసుకుని సపోర్టింగ్ రోల్స్ లో కూడా మెప్పించాడు.

అయితే హీరో గా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు. ఆ మధ్య మోహన్‌బాబు `సన్నాఫ్‌ ఇండియా` చిత్రంతో వచ్చారు. ఓటీటీ కోసం చేసిన ఈ చిత్రాన్ని థియేటర్లో రిలీజ్‌ చేసి విమర్శలందుకున్నారు. దారుణమైన ట్రోల్స్ కి గురయ్యాడు మోహన్‌బాబు.

ప్రస్తుతం మంచు లక్ష్మి తో ‘అగ్నినక్షత్రం’ అనే సినిమాలో నటిస్తున్న మోహన్ బాబు హీరో గా మరో ప్రయత్నం చేయబోతున్నాడని తెలుస్తుంది. ఈ మధ్య ఇటీవల మంచు విష్ణు `ఆండ్రాయిడ్‌ కుంజప్పన్‌ వెర్షన్‌ 5.25` అనే మలయాళ చిత్ర రీమేక్‌ రైట్స్ తీసుకున్నారు. ఈ మూవీ తెలుగు లో కూడా డబ్ అయ్యింది.

అయితే ఈ సినిమాను తెలుగు లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఇందులో మోహన్‌బాబు తండ్రిగా నటిస్తారని, కొడుకు పాత్రలో మంచు విష్ణు కాకుండా మరో యంగ్‌ హీరోని నటింపచేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఒటిటి ల వాళ్ళ జనాలు వేరే భాషా సినిమాలు చూడడానికి అలవాటుపడ్డారు, ఇప్పుడు ఆల్రెడీ చూసిన సినిమా ని మళ్ళీ జనాలు ఆదరిస్తారో లేదో చూడాలి.