రామ్ చరణ్ ఇలా ఉంటే డేటింగ్ కి రెడీ..మిస్ వరల్డ్, హీరోయిన్ హాట్ కామెంట్స్.!

Miss World

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఏ రేంజ్ స్టార్డం తెచ్చుకున్నాడో చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా లేడీస్ లో తన పర్సనాలిటీతో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ని చరణ్ తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు ట్రిపుల్ ఆర్(RRR) తో అనే కాకుండా అంతకు ముందు ధ్రువ సినిమాలో తన మేకోవర్ చూసే అన్ని సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా చరణ్ మారాడు.

ఇక ఇప్పుడు రాజమౌళి తో సినిమా చూసాక మరింత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న రామ్ చరణ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మనసు కూడా దోచుకున్నాడు. లేటెస్ట్ గా ఒక స్టార్ హీరోయిన్ కం మిస్ వరల్డ్ అయినటువంటి మానుషీ చిల్లర్ రామ్ చరణ్ పై కొన్ని హాట్ కామెంట్స్ చెయ్యడం వైరల్ గా మారింది.చరణ్ అంటే ఆమెకి చాలా ఇష్టం అని ఒకవేళ గాని చరణ్ కి పెళ్లి కాకుండా ఉంటే అతడిని డేట్ కి అడిగి తనతో డేటింగ్ లో ఉండేదాన్ని అని బాహాటంగానే చెప్పింది. దీనితో చరణ్ కి ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మిస్ వరల్డ్ రేంజ్ లో ఉంది అంటూ అతడి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇదిలా ఉండగా ఈ యంగ్ బ్యూటీ అయితే నటించిన లేటెస్ట్ బాలీవుడ్ ఫస్ట్ సినిమా “పృథ్వీ రాజ్” ఈ జూన్ 3న రిలీజ్ కాబోతుండగా ఈ సినిమాకి నటించిన ఈమె ఫస్ట్ రెమ్యూనరేషన్ గా 1 కోటి రూపాయలు తీసుకొని వార్తల్లోకి ఎక్కింది. ఇప్పుడు చరణ్ పై కామెంట్స్ తో మళ్ళీ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది.