ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయాలు, అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ప్రజల సమస్యల గురించి మాట్లాడటం, ప్రజా ప్రయోజనాల కోసం పోరాడటం ఎప్పుడో మానేశారు. వాళ్లకు ఇప్పుడు కావలసింది అధికారం దాని కోసం ఎంతకైనా దిగజారుతారు, ఏదైనా చేస్తారు. అలాగే ఏపీలో రాజకీయ నాయకులు మీడియా ముందుకు వస్తే ఎలాంటి కొత్త బూతులు మాట్లాడతారని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఇప్పుడు కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
బాబును బూతులు తిట్టిన కొడాలి
వాడుకోవడం వదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి నాని ఆరోపించారు. 74 ఏళ్ల వయసు వచ్చి, ఇంత రాజకీయ అనుభవం ఉండి మతాలు, కులాల గురించి చంద్రబాబు మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం మంత్రి కొడాలి నానీ మండిపడ్డారు. సీఎం, హోమ్ మంత్రి, డి జి పి, ఎస్ పి, క్రిస్టియన్లు అంటూ చంద్రబాబు మాట్లాడడం దారుణం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికారం కోసం ఎంతకైనా దిగజారే చంద్రబాబు అసలు మనిషే కాదు అని అన్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలను చూస్తున్న ప్రజలు అతన్నీ భూస్థాపితం చేయాలి అని కోరారు.
జగన్ కూడా ఆశ్చర్యపోయారా!!
కొడాలి నాని మాట్లాడిన మాటలు చూసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కొంత ఆశ్చర్యపోయారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే సీబీఎన్ లాంటి సీనియర్ నాయకుడి గురించి మాట్లాడుతూ కనీసం మర్యాద కూడా లేకుండా మాట్లాడటం సరికాదని జగన్ కూడా కొడాలికి సలహా ఇచ్చారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. చంద్రబాబు నాయుడు కూడా తన గౌరవాన్ని తగ్గించుకొని మరీ కావాలని కులాలు, మతాలతో రాజకీయాలు చేస్తున్నారు.