ఏపీలో మరో లొల్లి స్టార్ట్ అయింది. టీడీపీ నేత సబ్బం హరి, వైసీపీ నేతల మధ్య వార్ ముదిరిపోతోంది. ఒకరి మీద మరొకరు ఆడిపోసుకుంటున్నారు.
తాజాగా… మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి… సబ్బం హరిపై విరుచుకుపడ్డారు. సబ్బం హరి.. నువ్వు వీధి రౌడీవా? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ముందు.. అంటూ అవంతి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
సబ్బం హరి ఇంటికి ఆనుకొని ఉన్న గోడను జీవీఎంసీ అధికారులు కూల్చేశారు. అది అక్రమ కట్టడమని.. నోటీసులు ఇచ్చినా దానిపై సబ్బం హరి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదని.. అందుకే కూల్చేశామని జీవీఎంసీ అధికారులు ఒకవైపు చెబుతుంటే.. సబ్బం హరి మాత్రం… ముందుగా సమాచారం ఇవ్వకుండా జేసీబీలతో ఎలా కూల్చివేస్తారంటూ సబ్బం హరి జీవీఎంసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు.
అంతే కాదు.. వైసీపీ నేతలపైనా ఆయన నోరు పారేసుకున్నారని.. మంత్రి అవంతి మీడియా సమావేశంలో వెల్లడించారు. జీవీఎంసీ అధికారులపై దుర్భాషలాడటం ఏంటి? ఇక్కడ కక్షసాధింపులేవీ లేవు… అది అక్రమ నిర్మాణం కాబట్టే.. దాన్ని కూల్చేశారు. పార్కు స్థలం కబ్జా చేసి ఇల్లు కట్టారని ఫిర్యాదు అందింది. నోటీసులు ముందుగా ఇచ్చిన తర్వాతనే అధికారులు అక్రమణలను కూల్చేశారు. 3 కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమిస్తే చూస్తూ కూర్చోవాలా? అంటూ మంత్రి అవంతి ప్రశ్నించారు.