పంజాబ్ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ చేసింది. ఈ ఎన్నికల్లో హేమాహేమీలు మట్టి కరిచారు. 5 సార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా సేవలందించిన ప్రకాశ్ సింగ్ బాదల్ ఓటమి పాలయ్యారు. మరో ముఖ్య నాయకుడు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా ఓటమి పాలయ్యారు. ఇక పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి దిశగా వెళుతుంది. దీంతో కాంగ్రెస్ ముఖ్య నాయకులు తీవ్ర నిరాశతో ఉన్నారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్దూ రాజీనామకు సిద్దమైనట్లు తెలుస్తోంది
ఐదుసార్లు సీఎం.. అయినా ఓటమి.. పంజాబ్‌లో దిగ్గజాల ఓటమి!
