Sarkaru Vaari Paata : మెంటల్ మాస్ మహేష్ బాబు..”సర్కారు వారి పాట”లో ఆ రేంజ్ లో ఉంటుందా?

Sarkaru Vaari Paata : ఏ హీరోని తన అభిమాన హీరో ఓ రేంజ్ లో చూడాలి అనుకోడు చెప్పండి. అలా ఒక రెండు మూడు సినిమాలకి ఒకటే టైప్ లుక్స్ మరియు పాత్రలతో ఉంటే ఆడియెన్స్ సహా వారి అభిమానులు కూడా డిజప్పాయింట్ అవుతారు. మరి ఆ స్టేజ్ లో ఉన్న మహేష్ అభిమానులను బయటకి తీసుకొచ్చిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది “సర్కారు వారి పాట” సినిమా అనే చెప్పాలి.
దర్శకుడు పరశురామ్ పెట్లతో అనౌన్స్ చేసిన ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ తోనే భారీ హైప్ ని తెచ్చుకుంది. అక్కడ నుంచి ఇపుడు షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాపై చిత్ర బృందం మరింత మాస్ ని ఎక్కిస్తున్నారు. ఈ సినిమాలో లాస్ట్ గా ఒక పక్కా మాస్ సాంగ్ ని షూట్ చెయ్యగా ఈ ఒక్క సాంగ్ లో మహేష్ బాబు మాత్రం వేరే లెవెల్లో ఉంటాడని అంటున్నారు.
థమన్ ఈ సాంగ్ ఫైనల్ కట్ చూశానని సూపర్ గా వచ్చింది అని చెప్పగా మహేష్ అయితే ఈ సాంగ్ లో మెంటల్ మాస్ గా ఉన్నాడని నిర్మాణ సంస్థ వారు అంటున్నారు. అలాగే మళ్ళీ నెవర్ బిఫోర్ మహేష్ ని అయితే చూస్తారని ప్రామిస్ చేస్తున్నారు. దీనితో మహేష్ అభిమానులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తీ సురేష్ మొదటి సారిగా నటిస్తుండగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం మే 12న విడుదల కాబోతుంది.