జోరు పెంచిన మెహరీన్ రీజన్ ‘అదే’నేమో.!

నిశ్చితార్దాలూ, పెళ్లిళ్లూ క్యాన్సిల్ చేసుకున్న ముద్దుగుమ్మలకు లక్ బీభత్సంగా కలిసొచ్చేయడం అనేది ట్రెండ్ అయిపోయిందిప్పుడు. త్రిష, అమలాపాల్, లేటెస్టుగా సమంత.. అబ్బో.. ఆ లిస్టు తీస్తే చాలా పెద్దదే. కానీ, ఆ లిస్టులోనే అందాల భామ మెహ్రీన్ కూడా ఉందన్న సంగతి ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు బహుశా.

చక్కగా పెళ్లి చేసుకుని సెటిలైపోయిందనుకున్న మెహ్రీన్ కారణమేదైనా ఆ మధ్య డివోర్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. అలా డివోర్స్ అయ్యాయో లేదో, మన హనీ పాపకీ అవకాశాలు క్యూ కట్టేశాయి. ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టులు మెహ్రీన్ చేతిలో ఉన్నాయి.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఎఫ్ 3’లో వరుణ్ తేజ్‌కి జోడీ మెహ్రీన్ నటిస్తున్నసంగతి తెలిసిందే. అలాగే, సంతోష్ శోభన్ హీరోగా ‘మంచి రోజులు వచ్చాయి’ అనే సినిమాలోనూ మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మారుతి ఈ సినిమాకి దర్శకుడు. ఈ నెల 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమాల సంగతి అటుంచితే, ఆఫ్టర్ డివోర్స్ హనీ పాప గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియానీ హీటెక్కించేస్తోంది. చూస్తుంటే, హనీ పాప జోరు ఇప్పట్లో తగ్గేలా ఏం లేదు మరి.