అల్లూరి జయంతి ఉత్సవాలలో పాల్గొన్న మెగాస్టార్.. మెగాస్టార్ తో రోజా సెల్ఫీ..!

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు సందర్భంగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు బీజేపీ అధినేతలు కూడ పాల్గొన్నారు. జూలై 4వ తేదీ జరిగిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల సందర్భంగా నరేంద్ర మోడీ భీమవరంలో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నరేంద్ర మోడీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. దేశం కోసం అల్లూరి సీతారామరాజు చేసిన సేవలను కొనియాడారు.ఈ జయంతి వేడుకలలో ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా కూడా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు వేదిక మీద పాలుపంచుకునే అవకాశం రోజాకు లభించింది. ఈ సందర్భంగా రోజా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు ప్రముఖులకు ఆహ్వానం పలుకుతూ అంతా తానై వ్యవహరించింది.

ఈ క్రమంలో ప్రధానికి ఆహ్వానం పలికి ప్రధాని తో కలిసి వేదిక పంచుకున్న రోజా..అనంతరం నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో కలిసి సెల్ఫి దిగింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో రోజా గారికి ఉన్న ప్రత్యేకత ఏమిటో అందరి అర్థమయ్యింది. ఇక ఈ రోజా సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదిలా ఉండక అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు హాజరైన చిరంజీవి గారితో కూడా రోజా సరదాగా ముచ్చటించారు. కార్యక్రమం అనంతరం వేదిక నుండి కిందకి వచ్చిన తర్వాత రోజా చిరంజీవి గారితో సెల్ఫీ దిగింది. ప్రస్తుతం ఈ ఫోటో కూడా వైరల్ గా మారింది.