టాలీవుడ్ లెజెండ్ మెగాస్టార్ చిరంజీవికి సిల్వర్ స్క్రీన్ పై ఉన్న క్రేజ్ ఏపాటిదో అందరికీ తెలిసిందే. కానీ మెగాస్టార్ మ్యాజిక్ మాత్రం స్మాల్ స్క్రీన్ పై అస్సలు వర్కౌట్ కాలేదు. దీనితో చిరుని వెండితెరపై మాత్రమే చూసేందుకు అంతా ఆసక్తి కనబరుస్తున్నారు తప్పితే టీవీల్లో కాదని అర్ధం అయ్యిపోయింది.
అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు మళ్ళీ తన సినిమాల్తో బిజీగా ఉన్న చిరు ఓ భారీ డిజిటల్ ఆఫర్ వదులుకున్నట్టు తెలుస్తుంది. ప్రెజెంట్ ట్రెండ్ లో ఓటిటి రంగం చాలా పాపులారిటీ సంతరించుకోగా పలువురు నటులు వాటికోసం ముందుకు కూడా వస్తున్నారు.
అలా మెగాస్టార్ వద్దకు ఓ ప్రముఖ ఓటిటి సంస్థ తనతో హోస్టింగ్ చేయించేందుకు ఓ షో ని తీసుకెళ్లారట. అంతే కాకుండా తనకి భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ని కూడా ఆఫర్ చేసిన చిరంజీవి మాత్రం దానికి ససేమిరా అన్నారట. అయితే దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయని మెగా వర్గాలు చెబుతున్నాయి.
వీటి ప్రకారం చిరు మరిన్ని సినిమాలు కమిట్ అవ్వడం ఒక కారణం అయితే మరో బలమైన కారణం అసలు చిరు కి ఓటిటి లోకి వచ్చే ఆసక్తే లేదట. అందుకే పెద్ద ఆఫర్స్ వచ్చినా కూడా చిరు పట్టించుకోలేదని సమాచారం.