Megastar Chiranjeevi : లేటెస్ట్.. కరోనా వచ్చిన మహేష్ పై చిరంజీవి ఊహించని పోస్ట్.!

Megastar Chiranjeevi : జస్ట్ నిన్న ఒక్క రోజు వ్యవధిలోనే టాలీవుడ్ లో ఇద్దరు సెలెబ్రెటీలకు అలాగే హీరో నితిన్ భార్యకి కూడా కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. అయితే ఈ ముందు ఇద్దరు సెలెబ్రెటీ లలో మన టాలీవుడ్ బిగ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. తన భారీ సినిమా సర్కారు వారి పాట షూటింగ్ ని రీస్టార్ట్ చేద్దాం అనుకునే సమయంలోనే షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు.

తనకి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని అధికారికంగా పోస్ట్ చేయడంతో అభిమానుల్లో కల్లోలం స్టార్ట్ అయ్యింది. ఇక ఇక్కడ నుంచి టాలీవుడ్ ఇతర స్టార్ హీరోలు సహా హీరోయిన్స్ మహేష్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మరి ఇప్పుడు తాజాగా మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి మహేష్ విషయంలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టడం వైరల్ అవుతుంది..

మహేష్ నువ్వు త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని, అలాగే నిన్ను మళ్ళీ నీ యాక్షన్ లోకి వస్తే చూడాలని చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నానని సింపుల్ గా ఎమోషనల్ గా పోస్ట్ పెట్టకుండా కాస్త ఎగ్జైటింగ్ గానే తెలిపారు. దీనిథి మెగాస్టార్ ఈ విష్ మహేష్ ఫ్యాన్స్ లో ఆసక్తికరంగా మారింది.