గ్లింప్స్ టాక్ : 10 సెకండ్లలో మాస్ పూనకాలు తెప్పించిన “మెగాస్టార్ 154”.!

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా తెలుగులో రిలీజ్ కానున్న చిత్రాల్లో ఆల్రెడీ అప్పటికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నటువంటి చిత్రాల్లో మెగాస్టార్ నటిస్తున్న చిత్రం కూడా ఒకటి. అలాగే ఈ చిత్రంలో మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని దర్శకుడు బాబీ అయితే తెరకెక్కిస్తున్నాడు.

మరి ఈ సినిమా నుంచి అయితే రేపు దీపావళి కానుకగా చిత్ర యూనిట్ ఆల్రెడీ ఓ మాస్ అప్డేట్ ని అందిస్తున్నట్టు తెలిపారు. మరి మొదటి నుంచి కూడా ఈ సినిమా మెగా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేలా ఒక పూనకాలు తెప్పించే సినిమాగా నిలుస్తుంది అని చెప్పగా ఇప్పుడు రేపు రిలీజ్ చేసే టైటిల్ టీజర్ పై ఓ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ ని చిత్ర మేకర్స్ రిలీజ్ చేశారు.

మరి ఇది కేవలం 10 సెకండ్లు మాత్రమే ఉంది కానీ అందులో మెగాస్టార్ పై చూపించిన వీడియో బిట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో పేలాయి. దీనితో ఒక్కసారిగా ఇండస్ట్రీ వర్గాల్లో మరిన్ని అంచనాలు స్టార్ట్ కావడం విశేషం. పైగా మెగా ఫ్యాన్స్ అయితే మరింత ఎగ్జైటింగ్ గా ఉన్నారు.

ఇక ఈ చిత్రంపై దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు. అలాగే శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.