Mega Young Hero : అదిరిపోయిన ‘ఉప్పెన’ హీరో లైనప్.. ఏకంగా త్రివిక్రమ్ తోనే సెట్ చేసాడు!

Mega Young Hero : మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఎందరి హీరోల్లో లేటెస్ట్ సెన్సేషన్ పంజా వైష్ణవీ తేజ్ కూడా ఒకడు. అయితే తన మొట్ట మొదటి సినిమా “ఉప్పెన” తో ఇండియా లోనే ఏ హీరోకి లేని భారీ హిట్ ని అందుకోవడమే కాకుండా తన ఫస్ట్ సినిమా తోనే 100 కోట్ల గ్రాస్ ని అందుకున్న ఏకైక హీరోగా నిలిచాడు. మరి ఇదిలా ఉండగా ఈరోజు తన పుట్టినరోజు కానుకగా సినీ వర్గాల్లో శుభాకాంక్షలు తెలియజేస్తుండగా..

తన సినిమాల లైనప్ పై మాత్రం ఒక బిగ్ అప్డేట్ మరియు టర్న్ అని తన లేటెస్ట్ సినిమా అనౌన్సమెంట్ తో అనుకోవచ్చు. ఈసారి చేయబోయే ప్రాజెక్ట్ ఏకంగా త్రివిక్రమ్ మరియు టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ అయిన సితార ఎంటర్టైన్మెంట్స్ తో సినిమా అనౌన్స్ చెయ్యడం ఆసక్తిగా మారింది.

#Production16 ft. Panja Vaisshnav Tej - Announcement | Sithara Entertainments | Fortune Four Cinemas

 

అయితే ఈ ప్రాజెక్ట్ కి త్రివిక్రమ్ డైరెక్టర్ కాదు తాను కూడా నిర్మాతగా తన బ్యానర్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ తో వైష్ణవ్ ఈ సినిమా చేయనున్నాడు. అయితే ఈ అప్డేట్ చూస్తుంటే ఏదో గట్టి ప్రాజెక్ట్ నే చేస్తున్నట్టు అర్ధం అవుతుంది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం ఒక పక్కా మాస్ ప్రాజెక్ట్ గా ఉంటుంది అన్నట్టు చెబుతున్నారు.

అలాగే ఈ వీడియో చూస్తుంటే కూడా ఆ మాస్ ట్రీట్ బాగానే ఉండేలా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన మిగతా డీటెయిల్స్ మున్ముందు రివీల్ చెయ్యనున్నారు.