Chiranjeevi-Anil Ravipudi: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. వరుస సినిమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాలలో అనిల్ రావిపూడి సినిమా కూడా ఒకటి. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.
జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే ఈ సినిమాలోని సన్నివేశాలకు సంబంధించిన వార్తలు కొన్ని హాట్ టాపిక్ గా మారాయి. రీ ఎంట్రీలో డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్న చిరంజీవి ఆడియన్స్ ను వింటేజ్ మూడ్ లోకి తీసుకు వెళ్ళేందుకు రెడీ అవుతున్నారట. కమర్షియల్ కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్ తో తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. హైదరాబాద్ లో కీలక షెడ్యూల్ పూర్తి చేసిన అనిల్ రావిపూడి ప్రెసెంట్ ముసోరిలో మరో షెడ్యూల్ స్టార్ట్ చేశారట.
అయితే ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ కు సంబంధించిన సీన్స్ తెరకెక్కిస్తున్నారు. కాగా ఎప్పటి లాగే రొటీన్ గా కాకుండా మెగా మూవీస్ కు భిన్నంగా ఈ సినిమా క్లైమాక్స్ ను ప్లాన్ చేస్తున్నారట అనిల్ రావిపూడి. అవుట్ కామెడీ ట్రాక్ తో ఈ సినిమాను ముగించబోతున్నారట. చిరంజీవి సినిమాలలో ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేసే మాస్ యాక్షన్ తో పాటు తన మార్క్ కామెడీ కోటా కూడా కాస్త ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నారట అనిల్. ఇలా ఈ సినిమాలో కొత్త ప్రయోగాలు చేయడంతో పాటుగా ప్రేక్షకులకు భారీ సర్ప్రైజ్లు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అనిల్ రావిపూడి ఈ సినిమా కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా సినిమాపై అంచనాలను కూడా పెంచేస్తున్నారు. కదా ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎలాంటి గ్యాప్ ఇవ్వకుండా వరుస షెడ్యూల్ తో ప్లాన్ చేస్తున్నారు అనిల్ రావిపూడి.