దేవి నాగవల్లి, హీరో మధ్య ఉన్న గొడవలను పరిష్కరించిన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్?

హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చేసిన ఫ్రాంక్ వీడియో తీవ్రస్థాయిలో వివాదం సృష్టించింది. ఏకంగా ఈ వీడియో పై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయడం, డిబేట్ పెట్టి ఈ విషయం గురించి ప్రస్తావించడంతో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేకెత్తించింది.ఇక ఈ డిబేట్ లో భాగంగా హీరో విశ్వక్ సేన్ ను దేవి నాగవల్లి గెటవుట్ అనడం ఆయన కూడా అసభ్యకరమైన పదజాలం ఉపయోగించడంతో వీరిద్దరి మధ్య పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది.

ఈ క్రమంలోనే ఈ వివాదంపై ఎంతో మంది ప్రముఖులు స్పందించి వారి అభిప్రాయాలను తెలియజేశారు.ఏది ఏమైనా ఒక హీరోని టీవీ యాంకర్ అలా అనడం తప్పు అంటూ కొందరు మద్దతు తెలపగా మరికొందరు యాంకర్ దేవి నాగవల్లికి తమ మద్దతు తెలిపారు. ఇలా వీరిద్దరి మధ్య ఈ విషయం గురించి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వివాదం చెలరేగింది. ఈ క్రమంలోని వీరి వివాదం పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన రంగంలోకి దిగి టీవీ9 యాజమాన్యంతో మాట్లాడి వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్థలకు పరిష్కారం తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ కి టీవీ9 యాజమాన్యంతో మంచి సాన్నిహిత్యం ఉండటం వల్లే ఈయన ఈ వ్యవహారంపై స్పందించి ఈ సమస్యకు పరిష్కారం తెలియ చేశారని తెలుస్తోంది.ఇకపోతే అల్లు అరవింద్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా డిజిటల్ హక్కులను ఆహా కోసం భారీ ధరలకు కోసం కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఆహా అధికారకంగా తెలియజేయాల్సి ఉంది.