మెగా మాస్ పూనకాలు నుంచి సాలీడ్ అప్డేట్ వదిలిన యూనిట్.!

Mega 154

మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ ఫైనల్ గా గాడ్ ఫాదర్ సినిమాతో టాలీవుడ్ లో గట్టి కం బ్యాక్ ని అయితే తాను అందుకున్నారు. దీనితో ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ చేస్తున్న సినిమాలపై మంచి అంచనాలు అయితే నెలకొన్నాయి. అయితే ఈ సినిమాల్లో దర్శకుడు బాబీ తో మెగాస్టార్ చేస్తున్న సినిమా వాల్తేర్ వీరయ్య(అనధికారిక టైటిల్) కూడా ఒకటి.

అయితే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఆల్రెడీ ఫిక్స్ కాగా చిత్ర యూనిట్ అయితే సినిమా పై ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని ఇస్తున్నారు. అలా లేటెస్ట్ గా మరో కొత్త అప్డేట్ ని అయితే రివీల్ చేశారు. సినిమాకి ఎంతో కీలకమైనటువంటి డబ్బింగ్ కార్యక్రమాలను ఈరోజు నుంచే డబ్బింగ్ థియేటర్ లో పూజా కార్యక్రమం తో మొదలు చేసినట్టు అనౌన్స్ చేశారు.

సో దీనితో అయితే మెగా మాస్ పూనకాలు లోడ్ అవుతున్నాయని చెప్పాలి. అల్రెడీ ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లో మరో వింటేజ్ మాస్ ఏక్షన్ డ్రామాలా ప్లాన్ చేస్తున్నారు. డెఫినెట్ గా మళ్ళీ పాత చిరు ని అయితే చూపిస్తా అని దర్శకుడు ప్రామిస్ చేసాడు. ఇంకా ఈ సినిమాలో రవితేజ కూడా నటిస్తుండగా హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది. అలాగే మైత్రి మేకర్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు.