శ్రీముఖిని అవమానపరిచిన మెగా తనయుడు వరుణ్ తేజ్.. ఏం జరిగిందంటే?

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ముకుంద సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. వరుణ్ తేజ్ కంచె, లోఫర్, ఫిదా, గద్దల కొండ గణేష్, F2 వంటి చిత్రాలలో నటించి నటుడిగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇటీవల వరుణ్ తేజ్ నటించిన గని సినిమా విడుదల అయ్యింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం వెంకటేష్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా F3. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవల వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన F2 సినిమా మంచి హిట్ అయ్యింది. ఈ సినిమాకి సీక్వెల్ గా ఎఫ్3 సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా టీమ్ జీ మహోత్సవం కార్యక్రమంలో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ బుల్లితెర యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

 

జీ మహోత్సవం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఇటీవలే విడుదలైంది. ఈ కార్యక్రమంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హాజరై తమ కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ శ్రీముఖి మీద పంచ్ వేసాడు. వరుణ్ తేజ్ శ్రీముఖిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ” శ్రీముఖి శ్రీముఖి నిన్ను చూస్తుంటే గుర్తొస్తోంది చంద్రముఖి ” అంటూ పంచ్ వేశాడు. వరుణ్ తేజ్ అలా అనగానే అక్కడున్న వారందరి ఒక్కసారిగా నవ్వారు. ఇక వెంకటేష్ కూడా తన కామెడీ టైమింగ్ తో యాంకర్ మీద రివర్స్ పంచులు వేస్తూ సందడి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.