Ram Charan: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతలు గురించి ప్రత్యేకంగా వివరించనవసరం లేదు . మెగాస్టార్ చిరంజీవి,ఆయన కుమారుడు రామ్ చరణ్ ఇద్దరు కూడా వారి జర్నీలో ఎంతో సక్సెస్ సాధించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “చిరుత ” సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు . ఆ సినిమా తర్వాత మన దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా వల్ల రామ్ చరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది . రామ్ చరణ్ తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ దాదాపు అన్ని సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి.రామ్ చరణ్ అతి తక్కువ సమయంలో స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.రామ్ చరణ్ తన నటనతో,డాన్స్ తో ప్రేక్షకులను తన అభిమానులుగా చేసుకున్నాడు.
ప్రస్తుతం రామ్ చరణ్ రెండవసారి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటించారు . పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకొని సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ వారి ఆశలను నిరాశపరుస్తూ ప్రతి సారి ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ఆచార్య సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ‘ఆర్ సీ 15’ సినిమాలో నటిస్తున్నాడు. రామ్ చరణ్ ఉపాసన కామినేని నీ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే . వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ బెస్ట్ కపుల్ గా నిలుస్తున్నారు . రామ్ చరణ్ సినిమాలతో బిజీగా ఉండగా , ఉపాసన అపోలో హాస్పిటల్ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు . రాంచరణ్ పర్సనల్ లైవ్ చాలా క్లీన్ అండ్ క్లియర్ గా ఉంటుంది. కానీ రామ్ చరణ్ చిరుత సినిమా సమయంలో తనపై వచ్చిన రూమర్స్ గురించి ఒక ఇంటర్వ్యూ లో చర్చించాడు. చిరుత సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహాశర్మతో రామ్ చరణ్ కు ఎఫైర్ ఉన్నట్టు అప్పట్లో రూమర్లు వినిపించాయి . కానీ తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఈ విషయంపై పై క్లారిటీ ఇచ్చాడు. ఈ వార్త చూసిన తరువాతే తనకు రుమర్లు ఎలా పుడతాయో అర్థమైందని, తర్వాత ఇలాంటి వార్తలు చూసినా కూడా ఇవన్నీ మామూలు విషయాలు అని అనిపిస్తుందని ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడారు.