జస్ట్ ఆర్టినర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2 మూవీగా రూపొందుతోన్న చిత్రం ‘మాయా పేటిక’. రమేష్ రాపార్తి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మి రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు గుణ బాల సుబ్రమణియమ్ సంగీతాన్ని సమకూరుస్తుండగా సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కామెడీ, డ్రామా జోనర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అనసూయ భరద్వాజ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ మాట్లాడుతూ..
పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.. మరో మంచి చిత్రం మాయాపేటికతో నేను మళ్లీ ఈ స్టేజ్ మీదకు వచ్చాను.. అభిమానుల ప్రేమ, సపోర్ట్ మాత్రం నాకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. వారి ప్రేమ మాత్రం ఎప్పుడూ మారడం లేదు. మీ ప్రేమను చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడికి థాంక్స్. ఇలాంటి సినిమా చేయాలంటో ఎంతో రీసెర్చ్ చేయాలి. ఇలాంటి కారెక్టర్, సినిమా అరుదుగా వస్తుంటాయి. డైరెక్టర్ రమేష్ గారితో మళ్లీ మళ్లీ పని చేయాలని ఉంది. మీ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. మీరు మళ్లీ నాతో సినిమా చేస్తారు కదా? చేయాలి. శరత్ గారితో పని చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయన నా లైఫ్ లాంగ్ ఫ్రెండ్ అయ్యారు’ అని అన్నారు.
రజత్ రాఘవ్ మాట్లాడుతూ.. ‘ ఈ చిత్రం నేను ప్రణయ్ పాత్రను పోషిస్తున్నాను. నేను పాయల్ బాయ్ ఫ్రెండ్‌లా నటిస్తున్నాను. ఓ ఫోన్ మన జీవితాలను ఎలా తలకిందులు చేస్తుందో ఈ సినిమాలో చూపించాం. ప్రతీ ఒక్కరి జీవితంలో ఫోన్ ఎంతో ఇంపార్టెంట్‌గా ఉంటుంది. కానీ ఈ సినిమాలో మాత్రం ఈ ఫోన్ నాతో చాలా ఆడుకుంది’ అని అన్నారు.
సునీల్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నక్కిలెసు గొలుసు నారాయణగా వాచ్ మెన్ పాత్రలో నటిస్తున్నాను. సెల్ ఫోన్ వచ్చాక నా జీవితంలో ఏం మార్పులు జరిగాయ్ అన్నది ఆసక్టికరంగా ఉంటుంది. జస్ట్ ఆర్డినరీ అని పెట్టారు కానీ ఎక్స్‌ట్రార్డనరీగా ఉంటుంది. నా పాత్ర మాత్రమే కాకుండా.. సినిమాలోని అన్ని పాత్రలు, కథ అంతా కూడా చెప్పేశారు. ఇలాంటి కథ, సినిమాను, ఇలాంటి కోణంలో ఇంత వరకు నేను ఎప్పుడూ చూడలేదు. కొత్తగా, కొత్తగా ఉండాలని అంతా అంటున్నారు.. కొత్తదనానికే కొత్తగా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు.
యాంకర్ శ్యామల మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఫోన్ లేకుండా జీవితం ముందుకు సాగదు. ఫోన్ అంటే ఉండే డిఫరెంట్ ఆలోచనల్లోకెల్లా మాయాపేటికతో మరొక కొత్త ఆలోచన, అర్థం తెలుసుకుంటారు.
విరాజ్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు నాకు చాలా ఎంతో ప్రత్యేకం. థాంక్యూ బ్రదర్ విడుదలైనప్పటి నుంచి ఈ టైం కోసం ఎదురుచూస్తున్నాను. ఆ సినిమాను అంత ఆదరించినందుకు థాంక్స్. మళ్లీ అంతే ప్రేమను ఈ సినిమా మీద కూడా చూపిస్తారని అనుకుంటున్నాను. మన జీవితం మన చేతుల్లో కాకుండా.. ఎక్కువగా సెల్ ఫోన్‌లోనే ఉంటుంది. నేను ఎంతో ఇష్టపడి చేసిన పాత్ర ఇది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ పాత్రను నాకు ఇచ్చిన డైరెక్టర్‌కు థాంక్స్. ఆయన నా సోదరుడిలాంటివారు. మా పెద్దన్న నిర్మాత ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. మా సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
సిమ్రత్ కౌర్ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. ఈ రోజు ఇలా మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మాయా పేటిక.. పేరుకు తగ్గట్టుగానే ఇందులో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. నన్ను నమ్మి నాకు ఈ పాత్ర ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. అశ్విన్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
హిమజ మాట్లాడుతూ.. ‘నాకు ఈ పాత్ర ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. ఇలాంటి ఓ మెచ్యూర్డ్ పాత్ర చేయాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను. ఫోన్ లేకుండా ఎవ్వరూ ఉండరు. అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్. అందరికీ రీచ్ అవుతుంది.
శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నేను కోతిని ఆడించుకునే పాత్రలో నటించాను. ఆ కోతి పేరు జ్యోతి. దానికి దొరికిన ఫోన్ నాకు తీసుకురావడంతో నా జీవితంలో జరిగే మార్పులు ఆసక్తికరంగా ఉంటాయి. నాలో దర్శకుడు హిజ్రాను చూశారు. మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడు థాంక్స్. మా నిర్మాత మంచిగా డబ్బులు ఇచ్చారు. సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. త్వరలోనే మీ ముందుకు వస్తున్నాం. ఫోన్ మీద సినిమా తీశామని ఫోన్‌లో చూడొద్దు.. థియేటర్లోనే చూడండి’ అని అన్నారు.
డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ.. ‘నా టీమ్‌ను మొత్తం స్టేజ్ మీద చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన అనసూయకు చాలా థ్యాంక్స్. మాయ పేటిక సినిమా స్కిప్ట్ సరికొత్తగా ఉంటుంది. సెల్ ఫోన్ ఆధారంగా ఈ స్క్రిప్ట్ రూపొందించాం. మీ సెల్ ఫోన్‌లో ఏయే ఫీచర్లు ఉన్నాయో ఈ సినిమాలోకూ మంచి విజువల్స్, మంచి సాంగ్స్, మంచి కామెడీతో ఇది ఫుల్ ప్యాకేజీ సినిమా. ఇందులో అన్నీ ఉన్నాయి. నన్ను నమ్మిన శరత్, తారక్‌లకు థాంక్స్. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ అందరికీ థ్యాంక్స్’ అంటూ చెప్పుకొచ్చాడు.
నిర్మాత శరత్ మాట్లాడుతూ.. ‘నేను మీలాగే ప్రతి శుక్రవారం సినిమా చూస్తుండేవాడిని. నేను కూడా ఏదో ఒక రోజు సినిమా తీయాలని అనుకున్నా. కరోనా సమయంలో థ్యాంక్ యూ బ్రదర్ మూవీ ద్వారా కొత్త కథను, కొత్త సినిమాను మీ ముందుకు తీసుకువచ్చా. మీరిచ్చిన ధైర్యంతో రెండో సినిమా మాయ పేటికను నిర్మించాను. ఇదొక సెల్‌ఫోన్ బేస్ ఆధారంగా తీశాం. ఈ సినిమాకు సహకరించిన నటీనటులు, డైరెక్టర్ రమేష్ అందరికీ థ్యాంక్స్’ అంటూ చెప్పుకొచ్చాడు.
అనసూయ మాట్లాడుతూ.. ‘జస్ట్ ఆర్డినరీ బ్యానర్ అంటే నాకు ఫ్యామిలీ లాంటిది. మళ్లీ ఇలా అందరినీ ఇక్కడ చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ చూశాను. చాలా చాలా బాగుంది. సినిమా అందరికీ నచ్చుతుంది. నేను ఈ సినిమాలో లేకున్నా చెబుతాన్నంటే అర్థం చేసుకోండి. నన్ను అందరూ చాలా సెల్ఫీష్ అని అందరూ అంటుంటారు. కానీ నేను లేకున్నా సినిమా బాగుందని చెబుతున్నానంటే అర్థం చేసుకోవాలి. చాలా బాగుంటుంది సినిమా. టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్’ అని అన్నారు.