Raviteja’s First Liplock : ఫస్ట్ టైం లిప్ లాక్ కి ఒకే చెప్పిన రవితేజ.. ఈ సినిమాలో అట.!

Raviteja’s First Liplock : టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటిస్తున్నా లేటెస్ట్ సినిమాలు కొన్ని ఉన్నాయి. అయితే ఈ చిత్రాల్లో ఒకదాన్ని మించి ఒకటి మంచి ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి ఇలా తన 50 ఏళ్ల వయసులో కూడా ఎంతో ఎనర్జిటిక్ గా సినిమాలు చేస్తున్నాడు. మరి ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చేసిన రవితేజ చాలా వాటిలో మంచి రొమాన్స్ యాంగిల్ ని కూడా చూపించాడు.

కానీ లిప్ లాక్స్ వంటి వాటికి మాత్రం కాస్త దూరంగానే ఉన్నారు. మరి ఇప్పుడు మొట్ట మొదటిసారిగా తన సినిమాలో లిప్ లాక్ కి ఓకే చెప్పారట. మరి ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ కి రెడీగా ఉన్న చిత్రం “ఖిలాడి” లో అట. దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు.

మరి వారిలోనే ఒకరితో రవితేజ మొదటి పెదవి కానిచ్చినట్టు సినీ వర్గాల్లో మాట. ఇక ఈ సినిమాలో హాట్ హీరోయిన్ డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరి లు హీరోయిన్లు గా నటించగా ఈ రానున్న 11న హిందీ తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. అలాగే దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి మంచి సంగీతం అందిస్తున్నాడు.