మాస్ రాజా రవితేజ వరుస పెట్టి సినిమాలు ఓకే చేస్తున్నాడు. మినిమమ్ గ్యారంటీ హీరోగా రవితేజకు మంచి పేరుంది. కానీ, మధ్యలో కొంత పిరియడ్ బ్యాడ్ టైమ్ నడించిందనుకోండి. ఏది పడితే అదే మట్టయిపోయింది రవితేజకు. అయితే, ఈ మధ్య మళ్లీ రవితేజ ట్రాక్ ఎక్కేశాడు.
అదే ట్రాక్ కంటిన్యూ చేస్తూ ఒకదానిపై ఒకటిగా సినిమాలు కన్ఫామ్ చేసేస్తున్నాడు. దాదాపు ఐదు ప్రాజెక్టులు వరకూ రవితేజ ప్రస్తుతం ఓకే చేసి పెట్టాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ‘ఖిలాడీ’ సినిమా మరి కొద్ది రోజుల్లో పూర్తయిపోతుంది. ‘రామారావు ఆన్ డ్యూటీ’ అంటూ మరో థ్రిల్లర్ సినిమా సెట్స్ పైనే ఉంది.
నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో ‘ధమాకా’ అను ఓ సినిమాని రీసెంట్‌గా అనౌన్స్ చేసి పెట్టాడు. ఇక ఇప్పుడు ఆర్‌టీ 70 అంటూ తన 70వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సుధీర్ వర్మ ఈ సినిమాకి దర్శకుడు. కాగా, ఇంతటితోనూ మాస్ రాజా స్పీడు ఆగలేదు. ఆర్ టీ 71 అంటూ మరో సినిమాని తాజాగా ఓకే చేశాడట.
ఈ సినిమాకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మరి కొద్ది గంటల్లోనే అధికారికంగా ప్రకటించబోతున్నాడట రవితేజ. ఈ సినిమాతో ప్యాన్ ఇండియా మార్కెట్‌పై మాస్ రాజా కన్నేసినట్లు తెలుస్తోంది. చూడాలి మరి, ఈ సినిమాకి సంబంధించి రవితేజ ఇవ్వబోయే ఆ న్యూ అప్‌డేట్ ఏంటో.