ఇండస్ట్రీ టాక్ : “వాల్తేరు వీరయ్య” నుంచి నెక్స్ట్ బ్లాస్ట్ ఎప్పుడంటే.!

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా టాలీవుడ్ లో రాబోతున్న భారీ చిత్రాల్లో మంచి అంచనాలు ఉన్న మెగా అండ్ మాస్ మల్టీ స్టారర్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కూడా ఒకటి. మరి ఈ చిత్రం రిలీజ్ కి ఇంకా డేట్ లాం కావాల్సి ఉండగా సినీ వర్గాల నుంచి అయితే లేటెస్ట్ గా ఓ అప్డేట్ తెలుస్తుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ తో పాటుగా మాస్ మహారాజ్ రవితేజ కూడా చాలా కాలం తర్వాత కనిపించనున్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఇంకా రవితేజ లుక్ గాని తనపై టీజర్ కానీ ఎప్పుడు ఉంటాయో అనేది ఇంకా చిత్ర యూనిట్ రివీల్ చెయ్యలేదు. మరి ఇప్పుడు అయితే రవితేజ పై బ్లాస్టింగ్ అప్డేట్ ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా మెగా వర్గాల నుంచి సమాచారం. మరి వచ్చే వారమే అంటే ఈ డిసెంబర్ లోనే రవితేజ పై ఓ సరికొత్త వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది.

మరి తన రోల్ ని పరిచయం చేస్తూ గాను లేదా తన లుక్ ని రివీల్ చేస్తూ ఈ టీజర్ ఉండనున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ మాస్ ట్రీట్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. అయితే ఈ చిత్రానికి డీఎస్పీ సంగీతం అందిస్తుండగా మైత్రి మేకర్స్ నిర్మాణం అందిస్తున్నారు.