దారుణం: వివాహేతర సంబంధం బయటపెడతానని వివాహితపై అత్యాచారం చేసిన బాలుడు.. చివరికి ఇలా!

ప్రస్తుత కాలంలో ప్రతి రోజు ఏదో ఒకచోట ఎన్నో అత్యాచార సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అత్యాచారానికి గురై అవమాన భారంతో ఆత్మహత్య చేసుకోగా మరి కొందరిని మాత్రం బలవంతంగా అత్యాచారం చేసి చంపుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్లోని బోరబండలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

హైదరాబాద్ బోరబండలో స్థానికంగా నివాసం వుండే వివాహిత తన ప్రియుడితో కలిసి వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ క్రమంలో తన ప్రియుడితో కలిసి తనకు వివాహేతర సంబంధం ఉందనే విషయాన్ని ఇస్మాయిల్ అనే వ్యక్తికి తెలియడంతో అదే అదునుగా చేసుకొని నిరంతరం ఆ వివాహితను బ్లాక్మెయిల్ చేసేవారు. తాము చెప్పే కండిషన్లకు ఒప్పుకోకపోతే ఆ వీడియోని బయట పెడతానంటూ ఆ యువతిని బెదిరించి లొంగ తీసుకున్నారు. ఇస్మాయిల్ తో పాటు మరొక బాలుడు సైతం ఆమె పై అత్యాచారం చేశారు.

ఈ విధంగా తరచూ ఆ వీడియోను అడ్డుపెట్టుకొని తనని బెదిరించడంతో విసిగిపోయిన అవివాహిత తన ప్రియుడితో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇస్మాయిల్ కేసు నమోదు చేశారు. ముందుగా విషయాన్ని పసిగట్టిన ఇస్మాయిల్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.