మనోజ్ అన్న మన కులపోడే.. ఇంతకీ ఏ కులం.?

Manojs Befetting Reply On Caste | Telugu Rajyam

మంచు మనోజ్ కమ్మ కులానికి చెందిన వ్యక్తి. అసలు ఈ ప్రస్తావన ఇప్పుడెందుకు.? ఎందుకేంటి.? సోషల్ మీడియా వేదికగా కొందరు కుల పిచ్చితో కొట్టుకు ఛస్తుంటేనూ.! తాజాగా సోషల్ మీడియాలో తన ‘కులం’ గురించి మంచు మనోజ్ ప్రస్తావించాల్సి వచ్చింది.

ఇంతకీ, మనోజ్ పేర్కొన్న ఆ కులం ఏంటో తెలుసా.? ప్రేమి’కులం’. పోలా.? అదిరిపోలా.? విషయమేంటంటే, ‘రాధేశ్యామ్’ సినిమా నుంచి ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఓ టీజర్ వదిలారు. దానిపై మనోజ్ స్పందించాడు. దాంతో ఓ నెటిజన్, ‘మనోజ్ అన్న కూడా మన కులపోడే..’ అని పేర్కొన్నాడు.

సదరు నెటిజన్ ట్వీటుపై స్పందించిన మంచు మనోజ్, ‘మనదంతా ఒకటే కులం ప్రేమికులం.. యునైటెడ్ వియ్ రైజ్.. డివైడెడ్ వియ్ ఫాల్.. లవ్ యూ..’ అంటూ ట్వీటేశాడు. కలిసి వుంటే ఎదుగుతాం.. విడిపోతే పడిపోతాం.. అన్నది మనోజ్ వాదన.

అదిరిపోయే రిప్లయ్ కదా.? అయితే, ‘రాధేశ్యామ్’ సినిమా గురించి ఎదురుచూస్తోన్నవారిలో మనోజ్ కూడా ఒకడని చెప్పడమే తన ఉద్దేశ్యమని సదరు నెటిజన్ వివరణ ఇచ్చుకున్నాడు. అదీ అసలు సంగతి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles