Mohan Babu: తెలుగు ప్రేక్షకులకు నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోహన్ బాబు ప్రసిద్ధం అడపాదడపా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మాణంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ప్రభాస్ అంటే పాన్ ఇండియా స్టార్స్ నటించిన విషయం తెలిసిందే. ఇంకా చాలామంది స్టార్ సెలబ్రిటీలు ఇందులో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన లభించింది.
మొదటి షోకే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకి క్యూ కట్టారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ అభినందిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేయడంతో మూవీ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా థ్యాంక్స్ మీట్ ని కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ థ్యాంక్స్ మీట్ లో భాగంగా నటుడు మోహన్ బాబు మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నటుడిగా 50 ఏళ్ల ప్రయాణం నాది.
అప్పటి నుంచి ఇప్పటివరకు నా అభిమానులు నా వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తున్నారు. కన్నప్ప సక్సెస్ తర్వాత వాళ్లంతా ఫోన్లు చేసి అభినందనలు తెలియజేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. వారి ప్రేమకు నేను తిరిగి ఏమి ఇవ్వగలను. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను మంచు మోహన్‌బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అనంతరం ఈవెంట్ లో భాగంగా విష్ణు మంచు మాట్లాడుతూ.. మాలాంటి నటీ నటులకు ప్రేక్షకులే దేవుళ్లు. వారి ఆదరణ, ప్రేమతోనే మేము ఈ స్థాయికి వస్తాం. కన్నప్ప కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇదంతా శివలీల. కన్నప్ప సినిమాను ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ అని తెలిపారు మంచు విష్ణు.