ఒక్క మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఏ సినిమా ఇండస్ట్రీ లో అయినా కూడా పెళ్లి చేసుకున్న స్టార్ నటులు తమ వైవాహిక బంధం నుంచి పలు కారణాల చేత విడిపోతున్న సందర్భాలు అనేకం. అలానే రీసెంట్ గా స్టార్ జంట సమంతా, నాగ చైతన్యలు విడిపోయారు.
మరి అలానే గత కొంత కాలం కితం తన వివాహ బంధం నుంచి మంచు వారి హీరో మంచు మనోజ్ కూడా తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇక అక్కడ నుంచి తన రెండో పెళ్లిపై తనకి తప్ప మిగతా వారు అందరికీ ఆసక్తి ఎక్కువ అయ్యిపోయింది.
అలా ఇప్పటికే చాలా సార్లు మనోజ్ చాలా సార్లు సమాధానం ఇస్తూ వచ్చాడు. కానీ ఈసారి చెప్పింది హైలైట్ అని చెప్పాలి. బ్రహ్మానందం ఫోటో రియాక్షన్ తో నా పెళ్ళికి నన్ను కూడా పిలవండి ఈసారి. ఆ పెళ్లి ఎక్కడో ఆ ఎవరో చెప్పమని తన పాట కూడా పాడేసాడు మనోజ్ రియాక్షన్ కాస్తా వైరల్ అవుతుంది.