Manchu Manoj : మంచు మనోజ్ ఎందుకు కెలుక్కున్నాడబ్బా.?

Manchu Manoj : ‘మా’ ఎన్నికల వ్యవహారాన్ని మంచు మనోజ్ ఇప్పుడెందుకు కెలుక్కున్నట్లు.? ఎన్నికలంటే చాలా వుంటాయ్.. అర్థం పర్థం లేని ఆ ‘మా’ ఎన్నికల చుట్టూ చాలా ఛండాలం నడిచింది. దాన్ని ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిదని చాలామంది అనుకున్నారు. చిత్రంగా మంచు మనోజ్ ఆ గొడవని కెలుక్కున్నాడిప్పుడు.

ఏదో తన తండ్రి మోహన్‌బాబు గురించీ, తన అన్న మంచు విష్ణు గురించీ జనాల్లో సింపతీ వస్తుందని, తనకు పబ్లిసిటీ వస్తుందని మంచు మనోజ్ అనుకున్నాడేమో.! లేకపోతే, బోల్డంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరైన ఓ విద్యాసంస్థ కార్యక్రమంలో మంచు మనోజ్, ‘మా’ ఎన్నికల వ్యవహారాన్ని ఎందుకు ప్రస్తావించినట్లు.?

ఆ విద్యా సంస్థ వార్షికోత్సవం.. అందునా మోహన్‌బాబు పుట్టినరోజు వేడుక.. అన్నీ కలిసొచ్చేశాయ్ అలా మనోజ్‌కి. మోహన్‌బాబు, విష్ణు మీద కంటే నాగబాబు మీదా, చిరంజీవి మీదా చాలా అభ్యంతకర వ్యాఖ్యల్ని చాలామంది చేసేశారు.. అదీ కూడా ‘మంచు’ కోటరీ వైపు నుంచి.

చిరంజీవికి ‘మా’ రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేకపోయినా, చిరంజీవి పేరుని బజారుకీడ్చేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ, చిరంజీవి లైట్ తీసుకున్నారు. ఆ గాయాన్ని మళ్ళీ ఇప్పుడు కెలకడం ద్వారా మంచు మనోజ్ ఏం సాధించాలనుకున్నట్టు.?

ప్రతి ఒక్కరికీ ఓ హయ్యర్ పర్పజ్ వుండాలనీ, తన తండ్రికి అది వుందనీ, తన తండ్రిని విమర్శించేవాళ్ళకి హయ్యర్ పర్పజ్ లేదనీ మనోజ్ సెటైర్ వేశాడు. బహుశా ఇలా సెటైర్ వేయడమొక్కటే మంచు మనోజ్ హయ్యర్ పర్పజ్ అయి వుంటుంది. ఆ పర్పజ్ కోసం పాకులాడి, ఇప్పుడు ట్రోలింగ్‌కి గురవుతున్నాడు.