మోహన్ బాబు తనయుల్లో విష్ణు ఎక్కువగా తండ్రితో క్లోజ్ గా ఉంటె, లక్ష్మి, మనోజ్ బాగా క్లోజ్ గా ఉంటారు. మొదటి పెళ్లి విడాకులకు దారి తీయడంతో బాగా డిస్టర్బ్ అయిన మనోజ్ చాలా కాలం గా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.
ఈ మధ్యే తాను భూమా మౌనికారెడ్డి ని పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఇటీవల వినాయకచవితి నవరాత్రుల సమయంలో మంచు మనోజ్ భూమా మౌనికారెడ్డి తో కలిసి హైదరాబాద్ లోని ఓ వినాయక మండపం వద్ద దర్శనం ఇచ్చాడు.
వీరిద్దరూ గత కొంతకాలంగా చెన్నై లో ఒకే ఇంట్లో ఉన్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీని పై త్వరలో క్లారిటీ ఇస్తానని మనోజ్ అన్నాడు. మొదటి సారి మంచు ఫ్యామిలీ నుండి మనోజ్ రెండో పెళ్లి పై స్పందించింది మంచు లక్ష్మి.
తాజాగా ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్ చేశారు. మనోజ్ పెళ్లి చేసుకుంటే నేనేం అంటానండి బాబు ఎవడి దూల వాడిది. ఎవరి బ్రతుకు వాళ్లని బ్రతకనివ్వండి. హానెస్ట్ లవ్ ను నేను బ్లెస్ చేస్తా…లైఫ్ లో రెండు ఎమోషన్స్ లవ్…భయం..జీవితాన్ని లవ్ తో లీడ్ చేస్తున్నామా లేదంటే భయంతో లీడ్ చేస్తున్నామా అనేది తెలుసుకోవాలి. నేను లవ్ తో నా జీవితాన్ని లీడ్ చేస్తున్నా అంటూ మంచు లక్ష్మీ కామెంట్స్ చేశారు.