Manchu lakshmi: పుష్ప టీంపై మంచు లక్ష్మి ఇంటరెస్టింగ్ కామెంట్స్ !

Manchu lakshmi interesting comments on Pushpa movie team

Manchu lakshmi: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా ‘పుష్ప- ది రైజ్’ ఇటీవల విడుదలై అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే, ఈ సినిమాలో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ యాక్టింగ్ ని ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. అంతేకాదు బన్నీ నటన చూసి సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఫిదా అయిపోయారు. తాజాగా పుష్ప మూవీని వీక్షించిన మంచు లక్ష్మి కూడా బన్నీ నటన చూసి థ్రిల్ అయిపోయింది. ఈ మేరకు మంచు లక్ష్మి అల్లు అర్జున్, పుష్ప టీం పై ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేసింది.

“పుష్ప సినిమా చాలా బాగుంది…అల్లు అర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంది. బన్నీకి హ్యాట్సాఫ్. పుష్పరాజ్ లాంటి పాత్రను స్టార్ హీరో చేసి మెప్పించడం చాలా బాగుంది. ఇక ఈ సినిమాలో సమంత తన డాన్స్‌తో, అలాగే రష్మిక తన నటనతో కేక పెట్టించారు. దేవిశ్రీప్రసాద్ కూడా తన మ్యూజిక్‌ తో మైండ్ బ్లాంక్ చేశాడు. ‘పుష్ప 2’ కోసం ఎదురు చూస్తున్నాను” అంటూ మంచు లక్ష్మి ట్వీట్ చేసింది.

దక్షిణాదిన థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ఇటీవలనే ‘పుష్ప’ సినిమా ‘అమెజాన్ ప్రైమ్’లో విడుదల అయ్యింది. కోవిద్, ఇతరత్రా కారణాలతో థియేటర్ లో చూడలేకపోయినటువంటి వారు అమెజాన్ లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా సీక్వెల్ పై ఇప్పుడు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. వచ్చే నెల నుంచి పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. యావరేజ్ టాక్ తోనే పుష్ప ఈ రేంజ్ లో దూసుకుపోవటానికి కారణం అల్లు అర్జున్, సుకుమార్ ల పనితనం. మరి పుష్ప-2 ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఏ విధంగా తీసి ఆకట్టుకుంటారో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.