‘మంచి రోజులు వచ్చాయ్’పై అంచనాలు అద్భుతః

అసలు సినిమా ఎప్పుడు ప్రారంభమైంది.? ఎప్పుడు పూర్తయిపోయింది.? అని అంతా ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. కరోనా తీవ్రంగా వున్న సెకెండ్ వేవ్ సమయంలోనే సినిమా అనౌన్స్ అవడం.. ఆ తర్వాత శరవేగంగా సినిమా పూర్తయిపోవడం జరిగిపోయాయి.

‘మారుతి’ బ్రాండ్ సినిమా ఇది. ‘ఏక్ మినీ కథ’ ఫేం సంతోష్ శోభన్ హీరోగా మెహ్రీన్ కౌర్ పిర్జాదా హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మీద ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే వున్నాయి.

మారుతి సినిమాలకు ప్రత్యేకంగా ఆడియన్స్ వున్నారనడం అతిశయోక్తి కాదేమో. సింపుల్ కాన్సెప్ట్స్ తీసుకుని, అంతే సింపుల్‌గా సినిమాల్ని తెరకెక్కించేసి హిట్లు కొట్టేస్తుంటాడు మారుతి. ఇక్కడ, ఈ ‘మంచి రోజులు వచ్చాయ్’ సినిమా విషయంలోనూ అదే జరగబోతోందట.

స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లూ ఈ ‘మంచి రోజులు వచ్చాయ్’ సినిమా ప్రమోషన్స్ కోసం తమవంతు సహకరిస్తున్నారు. దీపావళి పండగ హంగామా నడుమ, భారీ ఓపెనింగ్స్ ఈ చిన్న సినిమాకి వచ్చేలా వున్నాయ్.