Tollywood: చిరంజీవి అల్లు అర్జున్ పై మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు…. బన్నీ వేరే లెవెల్ అంటూ?

Tollywood: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోకు ఉన్నటువంటి క్రేజ్ అదే స్థాయిలో ఎప్పుడు కొనసాగుతూ కొత్తతరం వారు సరికొత్త కథలతో వస్తున్నప్పుడు తప్పనిసరిగా ఇండస్ట్రీలో హీరోల స్థానాలు మారుతూ ఉంటాయి. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో అంటే చిరంజీవి పేరు చెప్పేవారు. ఎన్టీఆర్ ఏఎన్నార్ వంటి వారి తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా అదే స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నారు.

ఇలా ఒకప్పుడు వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న చిరంజీవి తిరిగి రాజకీయాల వైపు వెళ్లారు. రాజకీయాలలో కూడా ఈయన పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. ఇల రాజకీయాలలోకి వెళ్లడంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన చిరు తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇక ఈయన రీ ఎంట్రీ నుంచి పలు సినిమాలలో నటిస్తున్న పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా బిఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి చిరంజీవి అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. చిరంజీవి స్థానాన్ని అల్లు అర్జున్ ఆక్రమించారని, అల్లు అర్జున్ క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో మార్మోగిపోతుందని తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ కావాలని మల్లారెడ్డి తెలియజేశారు.

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పూర్తిగా మారిపోయారని.. దాన్ని క్రేజ్ కూడా పెరిగిందని ఏకంగా 1800 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. కొత్త తరానికి అల్లు అర్జున్ బాగా కనెక్ట్ అయిపోయారని తెలిపారు. ఈయన గురించి హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ప్రశంసలు వస్తున్నాయి అంటూ మల్లారెడ్డి ఏకంగా అల్లు అర్జున్ పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు.. ఇలా ఈయన వ్యాఖ్యలకు బన్నీ ఫాన్స్ సంతోషం వ్యక్తం చేయగా చిరు ఫాన్స్ మాత్రం విమర్శలు కురిపిస్తున్నారు.