‘మేజ‌ర్’ చిత్రం యూత్ త‌ప్ప‌నిస‌రిగా చూడాల్సిన సినిమా : సంగీత దర్శకుడు శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌

అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో  ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‌మేజ‌ర్‌`కు సంగీతం స‌మ‌కూర్చిన  శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల బుధ‌వారంనాడు మీడియాతో ప‌లు విష‌యాలు పంచుకున్నారు.
-అడ‌వి శేష్‌తో నా జ‌ర్నీ చాలా క్రేజీగా అనిపిస్తుంది. కిస్‌, క‌ర్ణ సినిమాల‌కు ప‌నిచేశాను. త‌ర్వాత క్ష‌ణం చేశాను. అప్ప‌టినుంచి గూఢ‌చారి, ఎవ‌రు, ఇప్పుడు మేజ‌ర్ సినిమా చేశాను.- చిన్న బడ్జెట్‌, పెద్ద బడ్జెట్ అనే సినిమాలు నేను చూడ‌ను. మంచి కంటెంట్ చ‌క్క‌టి బాణీలు ఇవ్వ‌గ‌లనా అనేది చూస్తాను. డిజెటిల్లు వంటి సినిమా చేశాక మేజ‌ర్ అనే సినిమా చేయ‌డం గొప్ప‌గా భావిస్తున్నా.- నేను చిన్న‌త‌నంనుంచి సినిమాలు పెద్ద‌గా చూడ‌ను. కానీ సంగీతం, పాట‌లు బాగా ఫాలో అవుతాను. ఘంట‌సాల గారి పాట‌లు అంటే మ‌రీ ఇష్టం.- మేజ‌ర్ సినిమా అనేది మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందింది. బ‌యోపిక్‌. అందులో ల‌వ్‌స్టోరీ, పాట‌లు, నేప‌థ్య సంగీతం అన్నీ వున్నాయి. అంద‌రికీ అవి న‌చ్చుతాయి. ఇప్ప‌టికే పాట‌లు హిట్ అయ్యాయి.- నేను మ‌హేష్‌బాబుగారిని ట్రైల‌ర్ లాంఛ్‌ లోనే క‌లిశాను. త‌ర్వాత కుద‌ర‌లేదు.- నేను థ్రిల్ల‌ర్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు సంగీతం అందించాను. మాస్‌, కామెడీ సినిమాల‌కూ ప‌నిచేయాల‌నుంది. క్ష‌ణం త‌ర్వాత గ‌రుఢ‌వేగ‌, గూఢ‌చారి ఎవ‌రు, సినిమాలు అలా చేసిన‌వే.- మేజ‌ర్ సినిమాలో డ్రామా వుంది. యాక్ష‌న్‌, థ్రిల్లింగ్ మూవ్‌మెంట్‌, ల‌వ్‌స్టోరీతోపాటు చాలా ఎమోష‌న్స్ వున్నాయి. ఇవి ప్ర‌తి ఒక్క‌రికీ క‌నెక్ట్ అవుతాయి. అవే సినిమాకు హైలైట్ అవుతాయి.
1990 నాటి క‌థ కాబ‌ట్టి నేను అప్ప‌టి సంగీతం బాగా రావ‌డానికి కృషి చేశాను. నా కెరీర్ తొలినాళ్ళ‌లోనే బ‌యోపిక్ చేయ‌డం హ్యాపీగా ఫీల‌వుతున్నాను.
-పాట‌ల‌కు అనుగుణంగా ట్యూన్స్ వుంటాయి. Τఅలా వుంటేనే ఆ మూడ్‌లోకి తీసుకెళ్ళ‌గ‌లం. తెలుగు కంటే హిందీ భాషకు ట్యూన్ ట్రిక్కీగా అనిపిస్తుంది. ఈ ట్యూన్ దీనికి స‌రిపోయిందా లేదా అని ఆలోచించి మ‌రీ ఇవ్వాల్సి వుంటుంది. `హృద‌య‌మా అనే పాట‌ను ర‌మేష్ రాశారు. అలాగే కృష్ణ‌కాంత్‌, రాజీవ్ భ‌ర‌ద్వాజ పాట‌లు రాశారు.
– సింగ‌ర్స్ ఎంపిక అనేది మ్యూజిక్ ద‌ర్శ‌కుడే చూసుకుంటారు.
ఒక్కోసారి ద‌ర్శ‌కుడు కూడా సూచిస్తాడు కూడా.- ద‌ర్శ‌కుడు నాకు క‌థ చెప్ప‌గానే చాలా ఎగ్జైట్‌మెంట్ వ‌చ్చింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం అన‌గానే అప్ప‌టో జ‌రిగిన సంఘ‌ట‌న‌, ఆయ‌న ఫొటో నా క‌ళ్ళ‌ముందు క‌నిపించింది. అలాంటి సినిమాకు ప‌నిచేయ‌డం గ‌ర్వంగానూ వుంది.- నేను ఇప్ప‌టివ‌ర‌కు చేసిన సంగీతం మంచి ఆద‌ర‌ణ పొందాయి. అలాగే నేను ఏ సినిమా చేసినా ఫుల్ సినిమా చేస్తాను. ఇద్ద‌రు ముగ్గురు సంగీత ద‌ర్శ‌కులు ప‌నిచేయ‌డం అనేది నాకు న‌చ్చ‌దు. ఒక‌వేళ అలా చేస్తే మిక్సింగ్ సౌండ్‌లో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.
 – పాట‌లు కంటే బ్యాక్‌గ్రౌండ్ క‌ష్ట‌మ‌నేది అంద‌రూ అంటుంటారు.
నాకు ప‌ర్స‌న‌ల్ గా సాంగ్ చేయ‌డం ఇష్టం. బ్యాక్ గ్రౌండ్ చేయ‌డం అంటే కిక్ ఇచ్చిన‌ట్లుంది. నేను ఎక్కువ‌గా సినిమాలు చూడ‌ను. కానీ 1990 నుంచి పాట‌లు, సంగీతం అంటే బాగా ఇష్ట‌ప‌డ‌తాను. – ఎప్ప‌టిక‌ప్పుడు మ్యూజిక్‌ప‌రంగా అప్‌డేట్ అవుతాను. సంగీతానికి లిరిక్ అనేది చాలా ఇంపార్టెంట్‌. సౌండ్ అనేది చాలా కీల‌కం. పాట‌కు స‌రిప‌డా సౌండ్ త‌గిన‌ట్లే వుండాలి. అది చూసుకుంటాను. – ద‌ర్శ‌కుడు చాలా కూల్‌గా వుంటాడు. కానీ టేకింగ్‌లో త‌న స‌త్తా చూపిస్తాడు. స‌బ్జెక్ట్ డీల్ చేయ‌డంలో ఆయ‌న గ్రేట్‌.
– కొత్త  సినిమాలు…
న‌రేష్  చిత్రం ఇట్లు మారేడుమ‌ల్లి ప్ర‌జానీకం., క్ష‌ణం ద‌ర్శ‌కుడితో మ‌రో సినిమా. గూఢ‌చారి2, తెలిసిన వాళ్ళు, ఎవ‌రు అనే క‌న్న‌డ సినిమా చేస్తున్నాను. అని తెలిపారు.