Sarkaru Vaari Paata : మహేష్ సినిమా అసలు జాతర ముందుంది!

Sarkaru Vaari Paata :  టాలీవుడ్ సినిమా ఆల్ టైం అందగాడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. విజయ చిత్రాల దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ సినిమా మహేష్ కెరీర్ లో హ్యాట్రిక్ హిట్స్ తర్వాత వస్తుంది అందుకే అనేక అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి.
మరి ఇదిలా ఉండగా ఈ భారీ సినిమా ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం అవుతుండగా చిత్ర బృందం ఇప్పటివరకు చాలానే ఇంట్రెస్టింగ్ అప్డేట్ లు అందించారు. అయితే తాజాగా ఇవేవి అప్పుడే అయ్యిపోలేదని తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ చిత్రంపై మూడు పాటలు వచ్చి సూపర్ హిట్ కాగా..
సినిమాలో ఇంకో రెండు పాటలు ట్రైలర్ రిలీజ్ అయ్యాక వస్తున్నాయని ఈ సినిమా స్టార్ కంపోజర్ ఎస్ ఎస్ తమన్ కన్ఫర్మ్ చేసాడు. లేటెస్ట్ గా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఒక మాస్ సాంగ్ అలాగే ఇంకో మెలోడీ సాంగ్ ఉంటుంది అని థమన్ చెప్పాడు.
అంటే రిలీజ్ లోపు నాన్ స్టాప్ ట్రీట్ ఆగదు అని అర్ధం అయ్యిపోయింది. ఆల్రెడీ మాస్ సాంగ్ అయితే ఓ రేంజ్ లో వచ్చింది అని టాక్ ఉంది. మరి ఈ రెండు సాంగ్స్ ఎలా ఉంటాయో చూడాల్సిందే. అయితే ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మే 12న రిలీజ్ కాబోతుంది.