Sarkaaru Vaari Paata : తమిళ లో విడుదలకు సిద్ధమవుతున్న సర్కారు వారి పాట… టైటిల్ ఏంటంటే?

Sarkaaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వం లో వస్తున్న సినిమా సర్కార్ వారి పాట. ఈ సినిమాలో కీర్తి సురేష్ మొదటి సారి మహేష్ బాబు సరసన జోడిగా నటిస్తోంది. థమన్ ఈ సినిమాకి సంగీతం అందించగా, మైత్రి మూవీ మేకర్స్ 14రీల్స్ జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన కళావతి పాట యూ ట్యూబ్ లో రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దీని తర్వాత విడుదల అయిన రెండో పాట అయిన పెన్ని సాంగ్ కూడా అభిమానులను అక్కట్టుకుంది.

ఇక ఈ మధ్య విడుదలైన టైటిల్ సాంగ్ కి కూడా మంచి ఆదరణ లభించింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి లీకైన నాలుగవ పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. మాస్ బీట్ తో ఆకట్టుకుంటున్న ఈ పాటతో సినిమా పై అంచనాలను మరింత పెరుగుతున్నాయి .ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 12న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరొక అప్డేట్ బయటకు వచ్చింది.

తమిళ్ లో కూడా మహేష్ బాబుకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఈ సినిమాను తెలుగులోనూ తమిళంలోనూ ఒకేసారి విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుందట.తమిళ్ లో పుదియ అరసాంగం  అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.పుదియ అరసాంగం అంటే తమిళ్ లో కొత్త ప్రభుత్వం అని అర్ధం..  విడుదల సమయం దగ్గర పడుతుండటంతో తెలుగులో పాటు తమిళ్ లో కూడా ప్రమోషన్ మొదలు పెట్టబోతున్నారు. తమిళ్ వెర్షన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా తమిళ్ టైటిల్, ట్రైలర్, పాటలు కూడా రిలీజ్ చేయనున్నారని సమాచారం.. తమిళ లో మన సూపర్ స్టార్ సినిమా ఎలాంటి విజయాలు సాధిస్తుందో వేచి చూడాలి.