మహేష్ కి కీలక సర్జరీ..రెండు నెలలు బెడ్ పైనే..!

రీసెంట్ గా మన టాలీవుడ్ హీరోలు అందరికీ ఇదొక చిన్న సమస్యతో హాస్పిటల్ కి వెళ్లి సర్జరీలు చేపించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఇలా టాప్ స్టార్ లు సర్జరీలు చేపించుకున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరాడు. అయితే మహేష్ కి మాత్రం ఈ సర్జరీ కాస్త పెద్దదే అని చెప్పాలి.
మహేష్ కి మోకాలి చిప్పకి ఆపరేషన్ జరగనుందట. గత దూకుడు, 1 నేనొక్కడినే టైం నుంచీ మహేష్ కి ఈ కాలి సమస్య ఉందట. మరి ఇప్పుడు ఎట్టకేలకు ఈ సర్జరీ ని మహేష్ చేయించుకోవాలని ఫిక్స్ అయ్యాడట. అయితే ఇది చేసాక మాత్రం ఎలా లేదన్నా రెండు నెలలు మహేష్ కి బెడ్ రెస్ట్ తప్పదట.
ఈ గ్యాప్ లో తన షూటింగ్ కూడా ఆగిపోవాల్సిందే అట. అంటే దాదాపు మళ్ళీ ఫిబ్రవరిలో అలా సర్కారు వారి పాట షూటింగ్ స్టార్ట్ చేసి అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేయనున్నారట. ఇది అసలు మేటర్.