మరీ 500 రోజులా .. ఇలా అయితే కష్టం మహేష్ !

Mahesh taking nearly 500 days between releases
పెద్ద హీరోల సినిమా అంటే కాస్త ఎక్కువ సమయమే పడుతుంది.  ఒక్కొక సినిమాకు కనీసం ఆరేడు నెలలు తీసుకుంటారు.  ఈ గ్యాపే అభిమానులకు ఊపిరి ఆడకుండా చేస్తుంది.  ఎప్పుడెప్పుడు తమ హీరో సినిమా విడుదల అవుతుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. 
 
ఈ ఎదురుచూపులు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు మరీ ఎక్కువ.  ఆయన సినిమా సినిమాకు తీసుకునే గ్యాప్ మరీ ఎక్కువగా ఉంటోంది.  గత నాలుగైదు ఏళ్లలో ఇది మరీ ఎక్కువైంది.  మహేష్ బాబు చేసిన చివరి ఐదారు చిత్రాలు చూస్తే ఈ సంగతి తెలుస్తుంది. 
 
శ్రీమంతుడు తరవాత బ్రహ్మోత్సవం సినిమా చేయడానికి 287 రోజుల గ్యాప్ తీసుకున్న మహేష్ ఆ సినిమా తరువాత స్పైడర్ చేయడానికి సుమారు 500 రోజుల వరకు తీసుకున్నాడు.  ఆ సినిమా తర్వాత భరత్ అనే నేను విడుదలకు 200 రోజులు, దాని తరవాత మహర్షితో రావడానికి 380 రోజులు, ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరు విడుదలకు దగ్గర దగ్గర 250 రోజులు తీసుకున్నారు.  ఇక దాని తర్వాత సర్కారు వారి పాట అనౌన్స్ అయింది. 
 
లాక్ డౌన్ మూలంగా ఈ చిత్రం మరింత  వెనకబడిపోయింది.  ఇప్పటికే మహేష్ నుండి సినిమా వచ్చి 540 రోజులు దాటిపోయింది.  ఇంకా సినిమా సగం కూడ ఫినిష్ కాలేదు.  సంక్రాంతికి సినిమా ఉండవచ్చని అంటున్నారు.  అంటే ఇంకో ఐదు నెలలు.  ఇలా మొత్తంగా 800 రోజులకు మహేష్ సినిమా విడుదల.  ఈ గ్యాప్స్ చూస్తున్న ఫ్యాన్స్ ఇలా ఒక్కో సినిమాకు 400, 500 రోజుల గ్యాప్ అంటే కష్టం అని, పరిస్థితులు సర్దుకున్న తర్వాతైనా మహేష్ వేగం పెంచాలి అంటున్నారు.