కరోనా మహమ్మారి అన్ని రంగాలపై ఎంత ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సినిమా పరిశ్రమ కరోనాతో కుదేలైంది. సినిమా షూటింగ్స్ ఆగిపోవడం, థియేటర్స్ మూతపడడంతో ఇండస్ట్రీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కరోనా వలన లాక్‌డౌన్ ప్రకటించిన సమయంలో ఇళ్ళకే పరిమితమైన సెలబ్రిటీలు కాస్త డేర్ చేసి షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. సినిమా షూటింగ్స్ పూర్తైన వీటిని థియేటర్ లో విడుదల చేయాలంటే జంకుతున్నారు. కరోనాకి భయపడి ఇప్పట్లో జనాలు థియేటర్‌కు రారని భావిస్తున్న తరుణంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ డేరింగ్ స్టెప్ వేశాడు.
క్రిస్మస్ కానుకగా సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నాడు. కరోనా సమయంలో థియేటర్‌లో విడుదలవుతున్న తొలి చిత్రం ఇదే కాగా, ఈ సినిమాకి పలువురు సపోర్ట్ అందిస్తున్నారు.చిరంజీవి ఇప్పటికే తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరారు. ఈ సినిమా అందరికి ఆదర్శంగా ఉంటుందని కూడా పేర్కొన్నారు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన ట్విట్టర్ ద్వారా టీంకు శుభాకాంక్షలు తెలియజేశారు.
డిసెంబర్ 25న విడుదల కానున్న సోలో బ్రతుకే సో బెటర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన మహేష్ బాబు..కరోనా సమయంలో థియేటర్‌లో విడుదల అవుతున్న తొలి సినిమా ఇదే. ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది. సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, హీరోయిన్ నభా నటేష్‌తో పాటు చిత్ర బృందానికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను అని మహేష్ పేర్కొన్నారు. తమ సినిమాకు ఇంత మంది సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తుండడంతో సోలో బ్రతుకే సో బెటర్ చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తుంది.