విక్రమ్ సినిమా పై ప్రశంసలు కురిపించిన మహేష్… కేజిఎఫ్ పై ఎందుకు మౌనంగా ఉన్నారు?

సాధారణంగా ఒక సినిమా విడుదలైన తర్వాత ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఆ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ వారి అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే డౌన్లోడ్ ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ సినిమా విడుదలైన కానీ సినిమాని వీక్షించిన అనంతరం సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు. తాజాగా ఈయన కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాపై స్పందిస్తూ సినిమా గురించి ప్రశంసలు కురిపించారు.

ఈ విధంగా మహేష్ బాబు విక్రమ్ సినిమా పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేయడంతో ఎంతోమంది సంతోషం వ్యక్తం చేశారు. ఇక మహేష్ బాబు చేసిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా పై స్పందించి ట్వీట్ చేసిన మహేష్ బాబు కన్నడ నటుడు నటించిన కేజిఎఫ్ సినిమా పై మాత్రం స్పందించలేదు. ఈ క్రమంలోనే ఈ విషయం కాస్తా హాట్ టాపిక్ గా మారింది. మహేష్ బాబు కేజిఎఫ్ సినిమాపై స్పందించకపోవడానికి కారణం ఉందని తెలుస్తుంది .

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజిఎఫ్ సినిమా విడుదలైన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించినది మహేష్ బాబునే.అయితే ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడంతో ప్రశాంత్ మహేష్ బాబు ప్రశంసలకు ఇంప్రెస్ అయ్యి అతనితో సినిమా చేయాలని అనుకున్నారట. అయితే ఈ సినిమా చేయాలంటే మహేష్ బాబుకి కూడా పార్టనర్ షిప్ ఇవ్వాల్సి ఉంటుంది. కేవలం పార్టనర్ షిప్ మాత్రమే కాకుండా రేమ్యూనరేషన్ కూడా అధికంగా ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ విధంగా మహేష్ బాబుతో సినిమా చేయడం ప్రశాంత్ నీల్ కు వర్కౌట్ కాలేదు. దీంతో వీరిద్దరి కాంబోలో రావలసిన సినిమా రద్దు కావడంతో మహేష్ బాబు ప్రశాంత్ నీల్ పై కాస్త అప్సెట్ అయ్యారని తెలుస్తోంది. అందుకే ఈ విషయంపై వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతోనే మహేష్ బాబు కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమాపై స్పందించలేదని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.