Mahesh Fans : మహేష్ విషయంలో ఫ్యాన్స్ గుస్సా.. ఇంకా ఎన్ని సార్లు బాసు ఇలా.??

Mahesh Fans : టాలీవుడ్ లో ఉన్నటువంటి బిగ్ స్టార్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో తన సినిమాలకి మంచి మార్కెట్ ఏర్పర్చుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు తన కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది స్టార్ట్ చేశాడని చెప్పాలి. ఇప్పుడు తాను హీరోగా నటిస్తున్న భారీ సినిమా “సర్కారు వారి పాట” తోనే ఇది మొదలు కానుంది.

హిట్ దర్శకుడు పరశురాం పెట్ల ఈ చిత్రాన్ని సాలిడ్ స్టయిలిష్ కం మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు దీనితో ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు కానీ మహేష్ మాత్రం ఈ సినిమాని అందని ద్రాక్ష గానే పెడుతున్నాడు. నిజానికి ఈ సినిమా సంక్రాంతి బరిలోనే దిగాల్సి ఉంది. కానీ అప్పుడు రాజమౌళి కోసం ఈ విడుదల కాస్తా ఏప్రిల్ 1కి షిఫ్ట్ చేసుకున్నాడు.

సరేలే మళ్లీ పోకిరి రోజులు వచ్చాయి అని అభిమానులు అనుకున్నారు. కానీ ఇపుడు ఇదే డేట్ కి మెగాస్టార్ ఆచార్య నిన్ననే ఫిక్స్ అయ్యింది. దీనితో మళ్లీ మహేష్ తన సినిమా వాయిదా వేసుకున్నట్టు కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఇక మళ్లీ మహేష్ తన సినిమా ని వాయిదా వేసుకోవడంతో ఈ విషయంలో మహేష్ ఫ్యాన్స్ మాత్రం కాస్త గుస్సా గానే ఉన్నారు.

ఓ పక్క నిర్మాతలు అప్డేట్ లు ఇవ్వరు ఇంకో పక్క మహేష్ అతి మంచితనంతో వీరు ఇబ్బంది పడుతున్నారు. మరి ఫైనల్ గా ఈ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.