ఇండస్ట్రీ టాక్ – మహేష్ దీన్ని వదల్లేదట.!

Sarkaru Vaari Paata :  ఒక్క తెలుగు సినిమా దగ్గర మాత్రమే కాకుండా ప్రపంచ సినిమా దగ్గర కూడా ఒక మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు నిలుస్తాడు. అలాంటి మహేష్ ఎప్పుడు నేషనల్ మరియు ఇంటర్నేషనల్ లెవెల్ కి ఎదుగుతాడా అనే దానికి అయితే మొదటి మెట్టుగా తన లేటెస్ట్ సినిమా “సర్కారు వారి పాట” తోనే స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.

దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ సినిమా రీసెంట్ గానే షూటింగ్ ని పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధం అవుతుంది. అయితే ఈ సినిమాకి సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా ఎలా ఉంటుంది అనే దానిపై అందరికి ఒక క్లారిటీ ఉంది.

మహేష్ బాబు చాలా అందంగా స్టైల్ గా కనిపిస్తున్నాడని అలాగే మాస్ గా కూడా ఎక్కడా తగ్గకుండా ఉండేలా ఉన్నాడని క్లారిటీ అయితే ఉంది. కానీ అనూహ్యంగా ఇండస్ట్రీ వర్గాల నుంచి మహేష్ ఈ సినిమాకి కూడా తన గత సినిమాల్లో ఉండే ఓ అంశాన్ని వదల్లేదని తెలుస్తుంది. రీసెంట్ గా చూసినట్టు అయితే తన సినిమాలు ఫలితాన్ని పక్కన పెడితే గత ఐదేళ్లలో తన ప్రతి సినిమాలో కూడా ఇదొక ఏదొక చిన్న సందేశం కనిపిస్తుంది.

మరి అలాగే ఈసారి కూడా సర్కారు వారి పాటలో అలాంటి ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ని అందించినట్టుగా సినీ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే అదేంటి అనేది తెలియాలి అంటే వచ్చే మే 12వరకు ఆగక తప్పదని సినీ వర్గాల వారు అంటున్నారు. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా మైత్రి మూవీ వాళ్ళతో కలిసి మహేష్ కూడా ఈ సినిమాని నిర్మాణం వహించాడు.