దాన్ని కొనడం కోసం మహేష్ ఏకంగా 8 కోట్లు ఖర్చు పెట్టేశాడు !

Mahesh Babu using high end vanity van

Mahesh Babu using high end vanity van

ఇండస్ట్రీలో ఇప్పుడు చాలామంది స్టార్ హీరోలు సొంత క్యారవాన్ మైంటైన్ చేస్తున్నారు. గతంలో అంటే నిర్మాతలు పెట్టే క్యారవాన్లనే వాడుకునే స్టార్ హీరోలు ఇప్పుడు మాత్రం సొంత ఖర్చులతో తమకు నచ్చినట్టు వానిటీ వాహనాలను రూపొందించుకుంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ భారీ వ్యయంతో ఒక క్యారవాన్ కొనుక్కోగా ఇప్పుడు మహేష్ బాబు కూడ అలాంటి భారీ క్యారవాన్ వాహనాన్ని తెప్పించుకున్నారు. ఈ వానిటీ వ్యాన్ మొత్తం మహేష్ అభిరుచికి తగ్గట్టు డిజైన్ చేయబడింది.

దీనికోసం సూపర్ స్టార్ ఏకంగా 8 కోట్ల రూపాయలు వెచ్చించారట. ఈ వాహనంలో అన్ని అధునాతన సౌకర్యాలతో పాటు సేఫ్టీ మెజర్స్ అన్నీ ఉంటాయట. అంతేకాదు ఇందులో ఒక నలుగురు ఐదుగురితో కూర్చొని మీటింగ్ పెట్టుకునే సౌకర్యం కూడ ఉంటుందట. దీని ఇంటీరియర్ మొత్తం పూణేలో రూపొందించబడిందట. ఇందులో మహేష్ కోసం ప్రత్యేకమైన బెడ్ రూమ్, వాష్ రూమ్ ఉంటాయట. అందుకే వ్యాన్ అంత కాస్ట్లీ. ఈ వాహనాన్ని నిన్నటి నుండే వాడటం మొదలుపెట్టాడు సూపర్ స్టార్.