దత్తత తీసుకున్న ఊర్ల కోసం మహేష్ పోరాటం

Mahesh Babu trying to arrange Covid vaccine for Burripalem, Siddhapuram people
Mahesh Babu trying to arrange Covid vaccine for Burripalem, Siddhapuram people
 
సూపర్ స్టార్ మహేష్ బాబుకు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకోవడమే కాదు సమాజ శ్రేయస్సు కోసం వాటిని ఖర్చు చేయడం కూడ తెలుసు.  చేసే మంచి పనుల గురించి చెప్పుకోవడం మహేష్ బాబుకు అంతగా ఇష్టం ఉండదు.  కానీ అవి ఆ నోటా ఈ నోటా పడి బయటకు వస్తుంటాయి.  మహేష్ గతంలో ఆంధ్రాలో బుర్రిపాలెం, సిద్దాపురం అనే రెండు ఊర్లను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.  ఆ ఊళ్ళలో మంచి నీటి సదుపాయం, పాఠశాలలు లాంటి పలు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసిన ఆయన తాజాగా ఆ ఊర్ల కోసం ఇంకొక మంచి పని చేశారు.  
 
ప్రస్తుతం ఎక్కడ చూసినా జనం కరోనా వ్యాక్సిన్ కోసం అష్టకష్టాలు పడుతున్నారు.  45 ఏళ్ల పైబడినవారు చాలామంది వ్యాక్సిన్ దొరక్క ఇబ్బందులకు గురవుతున్నారు.  దీంతో మహేష్ బుర్రిపాలెం, సిద్దాపురం ఊర్లలో జనం కోసం వ్యాక్సిన్లు ఏర్పాటు చేసే పనిలో ఉన్నారట.  తన పలుకుబడిని ఉపయోగించి రెండు ఊర్లలో జనానికి  వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడం కోసం సంబందిత అధికారులతో మాట్లాడుతున్నారట.  త్వరలోనే అందరికీ వ్యాక్సిన్ దొరికేలా చేయాలని గట్టిగా ట్రై చేస్తున్నారట.