సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ చాలా యూనిక్. ఎప్పుడు గుబురు గడ్డంలో కనబడరు ఆయన. ఎంత మాస్ పాత్ర అయినా సరే మహా అయితే కొద్దిపాటి రఫ్ గడ్డం మాత్రమే పెంచుతారు. అంతకుమించి పెంచరు. నిజానికి ఆ అవసరం కూడ రాలేదు ఆయనకు. అలాంటి పాత్రలను కూడ ఎవ్వరూ తీసుకెళ్లలేదు ఆయన వద్దకు. కానీ భవిష్యత్తులో ఆ అవసరం వచ్చేలా ఉంది. మహేష్ గడ్డం పెంచక తప్పేలా లేదు. సూపర్ స్టార్ త్వరలో రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడట. అది కూడ హిస్టారికల్ నేపథ్యంలో కావడం విశేషం.
ఇంతకీ మహేష్ చేయబోయేది ఏ కథో తెలుసా.. ఛత్రపతి శివాజీ లైఫ్ స్టోరీ అంటున్నారు. అందుకే శివాజీ లుక్ కోసం మహేష్ కనీసం ఆరు అంగుళాల మేర గడ్డం పెంచాల్సి ఉందట. ఈ వార్తల్లో ఎంతమేర నిజం ఉందో తెలియదు కానీ ఛత్రపతి శివాజీ పాత్రలో మహేష్ బాబును ఊహించుకుంటే మాత్రం గూస్ బంప్స్ అంటున్నారు అభిమానులు. ఈ వార్తలు నిజమైతే చాలా బాగుంటుందని, మహేష్ బాబును ఇలాంటి హిస్టారికల్ సినిమాల్లో చూడాలనే తమ కోరిక నెరవేరుతుందని అంటున్నారు.