Mahesh Babu : ఆ ఒక్క యాడ్ కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకున్న మహేష్ బాబు.?

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పక్క సినిమాలతో పాటుగా అనేక రకాల బ్రాండ్స్ కి అంబాసిడర్ కూడా నటిస్తాడన్నా సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ బ్రాండ్స్ నుంచి వచ్చిన ఆదాయంలో 30 శాతాన్ని తన ఛారిటీకి మహేష్ పక్కన పెడతాడన్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసు అని చెప్పాలి.

అయితే మహేష్ చేసే ఈ యాడ్స్ లో కొన్ని భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో కూడినవి కూడా ఉన్నాయి. మరి వాటిలో కొన్ని కూల్ డ్రింక్స్ యాడ్ కూడా ఒకటి. మరి లేటెస్ట్ గా తాను చేసిన యాడ్ అయితే మహేష్ ఫ్యాన్స్ కానీ యాక్షన్ మూవీ లవర్స్ లో కానీ మంచి బజ్ నే సెట్ చేసింది.

అదే ప్రముఖ కూల్ డ్రింక్ యాడ్ “మౌంటెన్ డ్యూ”. హిందీలో బాలీవుడ్ బిగ్ స్టార్ హృతిక్ రోషన్ చెయ్యగా తెలుగులో అయితే మహేష్ చేసాడు. మరి చాలా ఆసక్తిగా ఉండే ఈ యాడ్ ని మహేష్ ఎంత రెమ్యునరేషన్ తీసుకొని చేసాడో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.

దీని కోసం గాను మహేష్ ఏకంగా 12 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఇది మాములు మొత్తం కాదని చెప్పలి. దీనితో ఇప్పుడు ఈ టాక్ వైరల్ అవుతుంది. ఇక ఇది పక్కన పెడితే మహేష్ దర్శకుడు పరశురామ్ పెట్ల తో “సర్కారు వారి పాట” అనే చిత్రాన్ని చేస్తుండగా అందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.