సూపర్ స్టార్ మహేష్ బాబు సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు.చిన్న పిల్లలకు గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు చేయిస్తున్న ఆయన మిగతా రెండు ఊర్లను దత్తత తీసుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇక ఈరోజు తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తన సొంత ఊరు బుర్రిపాలెంలో వ్యాక్సిన్లు పంపిణీ మొదలుపెట్టారు. తన తండ్రి జన్మదినం సందర్భంగా తన ఊరి జనాలకు, అక్కడి అభిమానులకు ఉపయోగపడే కార్యక్రమం ఏదైనా చేయాలి అనుకున్న మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
కరోనా వ్యాక్సిన్ పంపిణీని ఈ రోజు నుంచి ప్రారంభించి వరసగా ఐదు రోజుల పాటు కొనసాగించనున్నారు. 12 మున్సిపల్ వార్డులున్న బుర్రిపాలెంలో రోజుకు రెండు వార్డులు చొప్పున ఆరు రోజులు కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందట. ముఖ్యంగా ముందుగా 45 ఏళ్ళకు పైబడి వయసున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వడంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో మహేష్ తమ పట్ల చూపిస్తున్న శ్రద్దకు బుర్రిపాలెం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.