Mahesh Babu : 1058 ప్రాణాలు కాపాడిన మహేష్ వెనుక ఎంతో బలమైన కారణం.!

Mahesh Babu : తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర స్టార్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. మరి ప్రతి హీరోకి కూడా ఒక మార్క్ ఉన్నట్టే మహేష్ బాబుకి కూడా టాలీవుడ్ లో ఒక ట్రెండ్ ఉంది. అయితే మహేష్ బాబు వెండితెరపై హీరోగానే కాకుండా నిజ జీవితంలో కూడా హీరోనే అని చాలా మందికి తెలుసు.

ఇప్పటి వరకు మహేష్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాడు ఇంకా చేస్తున్నాడు. అయితే వీటి అన్నిటిలో చాలా కీలకమైనది మాత్రం చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించడం. ఇప్పటి వరకు మహేష్ బాబు అక్షరాలా 1058 మంది చిన్న చిన్న పిల్లల ప్రాణాలు కాపాడి మనషుల్లో దైవంలా మారాడు.

అయితే మహేష్ ఇలాంటి ఒక మహత్తర కార్యం చెయ్యడానికి కారణం ఏమిటి? ఎందుకు అంత ఖర్చు పెట్టి ఎందరో చిన్నారులను కాపాడి వారి తల్లిదండ్రుల పట్ల దైవంలా మారాడు అనే దానికి ఒక భావోద్వేగపూరిత బలమైన కారణమే ఉందని ఇప్పుడు రివీల్ అయ్యింది.

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ఓటిటి షో కి హాజరైన మహేష్ బాబు ఈ కారణాన్ని వెల్లడించడం ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతుంది. మహేష్ తన కొడుకు గౌతమ్ ఘట్టమనేని పుట్టినపుడు చాలా చిన్నగా కేవలం తన అర చేతి అంత మాత్రమే ఉన్నాడని ఇప్పుడు ఆరడుగులు ఉన్నాడు..

మాకు అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి పరవాలేదు కానీ డబ్బులు లేని వారి పరిస్థితి ఏమిటి? అనే ఆలోచన నుంచి ఇదంతా మొదలైంది అని తెలిపాడు. ఇలా మహేష్ అంతమంది చిన్నారుల హృదయాలకి ఊపిరి పోసిన వాడు అయ్యాడు.