మహేష్ కాపాడిన ప్రాణాల సంఖ్య 1020

Mahesh babu saved 1020 lives
Mahesh babu saved 1020 lives
Mahesh babu

మన స్టార్ హీరోలు చాలా మంది తరచూ పేదలకు, నిస్సహాయులకు సహాయం చేస్తూనే ఉంటారు. ఆపద సమయంలో మేమున్నామని ముందుకొస్తుంటారు. అలాంటి హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడ ఒకరు. అయితే మహేష్ తాను చేసే సహాయం గురించి ప్రపంచానికి పెద్దగా తెలియనివ్వరు. సహాయం చేయడమే ఉద్దేశ్యం కానీ నలుగురూ దాన్ని గురించి మాట్లాడుకోవడం కాదన్నది మహేష్ భావన. సూపర్ స్టార్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు వైద్య సహాయం అందిస్తున్నారు.

ఆంధ్రా హాస్పిటల్స్ యాజమాన్యంతో కలిసి చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారు. కష్టాల్లో ఉన్న పేద తల్లిదండ్రుల ఇంటి దీపాలు ఆరిపోకుండా చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు 1000 మందికి పైగా చిన్నారులకు సర్జరీలు చేయించిన మహేష్ తాజాగా ఇంకొక చిన్నారికి కూడ ఆపరేషన్ చేయించారు. దీంతో ఆయన కాపాడిన ప్రాణాల సంఖ్య 1020కు చేరుకుంది. మహేష్ ఉదారతకు, ఔన్నత్యానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యం పొందిన పిల్లల తల్లిదండ్రులు మహేష్ బాబు తమకు దైవంతో సమానమని చేతులెత్తి మొక్కుతున్నారు.