Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే. గత వారం రోజులుగా తరచూ ఏదో ఒక విషయంతో ఈయన పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. దానికి తోడు ఆయన నటించిన లేటెస్ట్ సినిమా సితారే జమీన్ పర్. ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
ఇది ఇలా ఉంటే ఇటీవల తాజాగా విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్గా స్పందన లభించింది. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ కూడా పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. ఈ సినిమా అందరి హృదయాలను కూడా కదిలించేసిందని చెప్పాలి. ప్రస్తుతం నెట్టింట ప్రశంసలు కూడా అందుకుంటుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాను చూసిన అభిమానులు నెటిజెన్స్ కొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా టాలీవుడ్ హీరో మహేష్ బాబు సైతం ఈ సినిమాను చూసి స్పందించారు.
ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ విధంగా రాసుకొచ్చారు. అద్భుతమైన సినిమా. అమిర్ ఖాన్ ఇతర క్లాసిక్ సినిమాల్లాగానే సితారే జమీన్ పర్ సినిమా కూడా మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, చప్పట్లు కొట్టేలా చేస్తుంది. సితారే జమీన్ పర్ చూశాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారు అంటూ చిత్ర బృందాన్ని అభినందించారు మహేష్ బాబు. ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు హీరో అమీర్ ఖాన్.